Home> హెల్త్
Advertisement

Pimples on Face after eating mangoes: మామిడి పండ్లు తిన్న తరువాత వేడి కురుపులు, మొటిమలు రాకుండా ఉండాలంటే..

Pimples on Face after eating mangoes: కొంతమందికి మామిడి పండ్లు తింటే ఆ తరువాత ముఖంపై మొటిమలు వస్తుంటాయి. ఆ భయంతోనే కొంతమంది తమకు మామిడి పండ్లు తినడం ఎంతో ఇష్టమైనప్పటికీ.. మొటిమలకు చెక్ పెట్టడం కోసం మామిడి పండ్లు తినడమే మానేస్తారు. కానీ ఆ సమస్యకు ఒక పరిష్కారం ఉంది తెలుసా ?

Pimples on Face after eating mangoes: మామిడి పండ్లు తిన్న తరువాత వేడి కురుపులు, మొటిమలు రాకుండా ఉండాలంటే..

Pimples on Face after eating mangoes: మామిడి పండ్లు అంటే కొంతమంది ఎంత ఇష్టం అంటే.. ఎండా కాలం వస్తే చాలు ప్రతీ రోజు మామిడి పండ్లు తిని ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. మామిడి పండ్లతో రసం చేసుకోవడం, ఐస్ క్రీమ్ చేసుకోవడం, ఫ్రూట్ సలాడ్, స్మూతీ.. ఇలా రకరకాల పద్ధతుల్లో మామిడి పండ్లు తినడం ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఈ మామిడి పండ్లను తిన్న తరువాత కొంతమందికి ముఖంపై మొటిమలు వస్తుంటాయి. ఆ భయంతోనే కొందరు తమ ఇష్టాన్ని చంపుకుని మామిడి పండ్లు తినకుండా ఉంటుంటారు. అలాంటి వారి కోసమే ఇదిగో ఈ సొల్యూషన్. 

మామిడి పండ్ల రసంలో యాంటీన్యూట్రియెంట్ ఫైటిక్ అనే యాసిడ్స్ ఉంటాయి. వీటికి విటమిన్లు, మినెరల్స్‌ని గ్రహించే శక్తికి ఆటంకం కలిగించే గుణం ఉంటుంది. అంతేకాకుండా మామిడి పండ్లలో ఉండే ఫైటిక్ యాసిడ్‌కి శరీరంలో వేడిని పుట్టించే గుణం ఉంటుంది. ఒక రకంగా మామిడి పండ్లు తింటే మొటిమలు రావడం వెనుక ఈ రెండు కారణాలు ఉంటుంటాయి. అయితే, మామిడి పండ్లను తినడానికి ముందుగా అర గంటసేపు నీటిలో నానబెట్టిన తరువాత తింటే మొటిమలకు చెక్ పెట్టవచ్చు అనే విషయం చాలామందికి తెలియదు. 

మామిడి పండ్లను 30 నిమిషాల సమయం పాటు నీటిలో పెట్టడం వల్ల అందులో ఉండే ఫైటిక్ యాసిడ్‌ నశిస్తుంది. ఆ తరువాత మామిడి పండ్లు తింటే ఫైటిక్ యాసిడ్స్ బారి నుంచి, అవి ఉత్పత్తి చేసే వేడి నుంచి తప్పించుకోవచ్చు. మామిడిపండ్లలోని తెల్లటి రసంలో యాంటీన్యూట్రియెంట్ ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. నీళ్లలో నానపెట్టినప్పుడు అది తొలగిపోతుంది. మామిడిపండ్లు తినడం వల్ల శరీరం థర్మోజెనిసిస్‌ బారిన పడుతుంది. అదే థర్మోజెనిసిస్ మామిడి పండ్లు తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతుంది. 

మొటిమలు రాకుండా, గుండెల్లో మంట లేదా యాసిడ్ రిఫ్లక్స్ లేకుండా మామిడి పండ్లను ఆస్వాదించే మార్గాలు ఇదిగో..
1. మామిడి పండ్లను తిన్న తర్వాత మొటిమలు రాకుండా ఉండాలంటే వాటిని ముందుగా కనీసం అర గంట నుంచి 2 గంటలపాటు నీళ్లలో పెట్టాలి.
2. మామిడి పండ్లను తిన్న తరువాత వచ్చే వేడిని తగ్గించడానికి.. మామిడి పండ్లను తిన్న తరువాత వెంటనే ఒక గ్లాసు వెగాన్ మిల్క్ తాగండి.
3. మామిడి పండ్లను యోగర్ట్‌తో చేసిన పదార్థాలతో కలిపి తినకూడదు.

Read More