Home> హెల్త్
Advertisement

Control Diabetes: ఇవి తింటే ఒంట్లో షుగర్‌ ఖాళీ.. మధుమేహం మటాష్‌..

Control Diabetes: మెంతులతో తయారు చేసిన నీటిని తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. ఇవే కాకుండా అనేక లాభాలు కలుగుతాయి. 

Control Diabetes: ఇవి తింటే ఒంట్లో షుగర్‌ ఖాళీ.. మధుమేహం మటాష్‌..

Fenugreek Seeds Benefits: ఆయుర్వేద శాస్త్రంలో మెంతుల గురించి చాలా క్లుప్తంగా వివరించారు. ఇందులో శరీరానికి కావాల్సిన అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగించే మూలకాలు కూడా లభిస్తాయి. అయితే వీటిని ప్రతి రోజు ఆహారాల్లో తీసుకోవడం వల్ల అనేక రకాల లాభాలు పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల షుగర్‌ లెవల్స్‌ కూడా కంట్రోల్‌ అవుతాయి. అంతేకాకుండా సులభంగా బరువు కూడా తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మెంతులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
జీర్ణ వ్యవస్థకు మేలు:

మెంతులు లేదా వాటిని నానబెట్టిన నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థను మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఆకలి కూడా విపరీతంగా పెరుగుతుంది. దీని కారణంగా జీర్ణక్రియ శుభ్రమవుతుంది. అలాగే అజీర్ణం, మలబద్దకంతో పాటు అనేక పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

షుగర్ లెవెల్స్ నియంత్రణ:
మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడాని సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. దీని కారణంగా రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.

గుండె ఆరోగ్యానికి:
మెంతులు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక గుణాలు ఉంటాయి. కాబట్టి మెంతులను నానబెట్టి నీటిని తాగడం వల్ల కొలెస్ట్రాల్ పరిమాణాలు తగ్గుతాయి. అంతేకాకుండా రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుందని ఆరయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. 

చర్మం, జుట్టు ఆరోగ్యానికి: 
మెంతులు చర్మంతో పాటు జుట్టు ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా చర్మం మృదువుగా తయారవుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. అలాగే జుట్టు కూడా సులభంగా పెరుగుతుంది.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

బరువు తగ్గడానికి: 
మెంతులు బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇవి జీవక్రియ రేటును పెంచుతాయి. దీని కారణంగా సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా స్త్రీల ఆరోగ్యాన్నిపెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More