Home> హెల్త్
Advertisement

Fennel Seeds Benefits: సోంపుతో క్యాన్సర్‌ సైతం ఒంట్లో నుంచి పరిపోవాల్సిందే!

What Are The Benefits of Fennel Seeds: సోంపును ప్రతి రోజు ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు తీవ్ర వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. 

Fennel Seeds Benefits: సోంపుతో క్యాన్సర్‌ సైతం ఒంట్లో నుంచి పరిపోవాల్సిందే!

 

What Are The Benefits of Fennel Seeds: సోంపును అందరూ మౌత్‌ ప్రెష్‌నర్‌గా వినియోగిస్తారు. భారతీయులు భోజనం తర్వాత నమలడం అనవాయితిగా వస్తోంది. అంతేకాకుండా దీనిని వంటకాల రుచిని పెంచేందుకు కూడా వాడతారు. అయితే ఇందులో అధిక పరిమాణంలో పాలీఫెనాల్ అనే యాంటీఆక్సిడెంట్ లభిస్తాయి. కాబట్టి దీనిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ సోంపు ప్రతి రోజు నమిలి తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది:
గుండె జబ్బు:

గుండె జబ్బులతో బాధపడేవారి సంఖ్య భారత దేశ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతోంది. దీని వల్ల చాలా మంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే గుండె సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు  7 నుంచి 10 గ్రాముల సోపును తింటే శరీరానికి పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అధిక పరిమాణంలో లభిస్తాయి. దీంతో గుండె సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. 

ఆకలిని నియంత్రిస్తుంది:
ప్రస్తుతం చాలా మంది తరచుగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల బరువు పెరుగుతున్నారు. ఇలాంటి వారు తప్పకుండా ఆకలిని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. దీని కోసం మీరు ప్రతి రోజు సోంపు నీటిని తాగాల్సి ఉంటుంది. ఈ నీటిని ప్రతి రోజు తాగడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో పాటు శరీర బరువు కూడా తగ్గుతారు. 

Also Read: Rinku Singh: మళ్లీ సిక్సర్ల వర్షం కురిపించిన రింకూ సింగ్.. సూపర్ ఓవర్‌లో మెరుపులు.. వీడియో చూశారా..!  

మధుమేహాన్ని నియంత్రిస్తుంది:
డయాబెటిక్ పేషెంట్లు తప్పకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే గుండె పోటు, రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి రోజూ ఒక గ్లాసు సోపు నీరును తాగాల్సి ఉంటుంది. ఇలా తాగడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు అదుపలో ఉంటాయి. 

క్యాన్సర్‌ నివారణకు..:
సోంపు నీరు  క్యాన్సర్‌తో పోరాడడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు ఈ సోంపుతో తయారు చేసిన నీటిని తాగడం వల్ల రొమ్ము క్యాన్సర్‌తో సహా కాలేయ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. దీంతో పాటు అనేక రకాల వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Also Read: Rinku Singh: మళ్లీ సిక్సర్ల వర్షం కురిపించిన రింకూ సింగ్.. సూపర్ ఓవర్‌లో మెరుపులు.. వీడియో చూశారా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More