Home> హెల్త్
Advertisement

Paracetamol dose: పారాసిటమోల్, డోలో, క్రోసిన్, కాల్పోల్ ఏయే వయస్సుల వారికి ఎంత డోస్ అవసరమో తెలుసా?

Paracetamol dose: చిన్న జ్వరం వచ్చినా.. చాలా మంది పారాసిటమోల్ వేసుకో అని సలహా ఇస్తుంటారు. మరి పారాసిటమోల్ ఎలా పడితే అలా వాడొచ్చా?

Paracetamol dose: పారాసిటమోల్, డోలో, క్రోసిన్, కాల్పోల్ ఏయే వయస్సుల వారికి ఎంత డోస్ అవసరమో తెలుసా?

Paracetamol dose: పారాసిటమోల్​.. చాలా మంది తమకు చిన్న నలతగా అనిపించినా దీనిని వాడుతుంటారు. డాక్టర్​ ప్రిష్క్రిప్షన్ లేకుండానే ఇది మెడికల్​ షాపుల్లో దొరుకుతుంది. అయితే చాలా మందికి ఇది ఎంత మోతాదులో వేసుకోవాలి? ఏ వయసు వారికి ఎంత మోతాదు ఇవ్వాలని అనే విషయం (Paracetamol dosage) తెలియదు.

పారాసిటమోల్​​లో స్టెరాయిడ్లు ఉంటాయి కాబట్టి.. దీని మోతాదు గురించి తెలుసుకోకుండా వాడటం సరికాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం ఆరోగ్యాన్ని హాని కలిగించొచ్చని (Paracetamol dosage by weight adults) అంటున్నారు.

పారాసిటమోల్​​​ను సాధారణంగా జ్వరం, మైగ్రేన్​, పీరియడ్స్​ నొప్పి, తన నొప్పి, పంటి నొప్పి, బాడీ పెయిన్స్ వంటి వాటికి ఉపయోగిస్తుంటారు. మార్కెట్లో ఇది కాల్పోల్​, క్రోసిన్ డోలో వంటి పేర్లతో వివిధ మోతాదుల్లో లభిస్తుంది.

జ్వరలో వచ్చినప్పుడు పారాసిటమోల్​​ మోతాదు ఎంత?

అమెరిరకార ఔషధ నియంత్రణ సంస్థ ప్రకారం.. జ్వరం వచ్చినప్పుడు పెద్దలకైతే. 325 ఎంజీ నుంచి 650 ఎంజీ వరకు ఇవ్వొచ్చు. నాలుగు నుంచి 6 గంటల వ్యవధిలో వీటిని ఇవ్వొచ్చు. రెండు డోసుల మధ్య విరామం 8 గంటలుగా ఉంటే.. 1000 ఎంజీ వరకు ఉండొచ్చని చెబుతున్నారి నిపుణులు.

అయితే ఈ మోతాదు అనేది.. తీసుకునే వ్యక్తి ఎత్తు, బరువు, గతంలో ఉన్న ఆరోగ్య సమస్యల వంటివి కూడా ఈ మోతాదను డిసైడ్ చేస్తాయి అని అంటున్నారు (Paracetamol dosage per day for adults) విశ్లేషకులు.

జ్వరం వచ్చిన ఆరు గంటల తర్వాతే.. 500 ఎంజీ పారాసిటమోల్​​ వేసుకోవాలి. పిల్లకు పారాసిటమోల్​ ఇచ్చే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.

నెలకన్నా తక్కువ వయసున్న శిశువలకు 4-6 గంటల వ్యవధిలో కిలో బరువుకు 10 నుంచి 15 ఎంజీ పారాసిటమోల్ (Paracetamol dosage by weight Children)​ ఇవ్వాలి.

బాడీ పెయిన్స్ విషయంలో ఇలా..

ఒళ్లు నొప్పుల కోసం పారాసిటమోల్​ వాడాల్సి వస్తే.. 325 ఎంజీ నుంచి 650 ఎంజీ వరకు తీసుకోవచ్చు. 4-6 గంటల వ్యవధిలో దీనిని తీసుకోవాలి. అదే సమయంలో 6-8 గంటల వ్యవధిలో అయితే 1000 ఎఁజీ వరకు తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
చిన్న పిల్లకు అయితే.. కిలోకు 10-15 ఎంజీ మోతాదులో పారాసిటమోల్ (What is the exact dose of paracetamol for adults)​ తీసుకోవచ్చు.

ఎన్ని రోజులు తీసుకోవచ్చు?

జ్వరం కారణంగా మూడు రోజులు పారాసిటమోల్​​ తీసుకున్నా.. ఇంకా జ్వరం తగ్గకపోతే, అప్పుడు వైద్యుడిని సంప్రదించాలని నిపుములు చెబుతున్నారు. ఎలాంటి నొప్పి వచ్చినా 10 రోజులకు మించి పారాసిటమోల్​ తీసుకోకూడదని స్పష్టం చేస్తున్నారు.

ఇక కాలేయ సమస్య, కిడ్నీ సమస్య, ఆల్కహాల్ సంబంధి సమస్య, బరువు తక్కువగా ఉన్న సందర్భాల్లో వైద్యుల సలహా లేకుండా పారాసిటమోల్​​ తీసుకోకూడదు సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

పారాసిటమోల్​ అధికంగా వాడటం వల్ల సమస్యలు..

పారాసిటమోల్​ను అధికంగా వాడటం వల్ల.. కొన్నిసార్లు సైడ్​ ఎఫెక్ట్స్​ కూడా వస్తాయి. అలెర్జీలు, చర్మంపై దద్దుర్లు ఏర్పడం, చర్మ సంబంధి రుగ్మతలు రావచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఇక మోతాదు అధికంగా ఉంటడం వల్ల మూత్ర పిండాలు దెబ్బతినడం, కాలెయం పాడవడం వంటి సమస్యలు కూడా రావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని సార్లు ఆకలి లేకపోవడం, విరేచనాలు, నిద్రలేమి, వాంతులు, కడుపునొప్పి, ఉబ్బరం, పొత్తి కడుపు తిమ్మిర్ల వంటి సమస్యలు కాడా రావచ్చని (Paracetamol over dosage side effects) అంటున్నారు.

Also read: Rose Water Health Benifits : రోజ్ వాటర్‌తో కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు...

Also read: Aloe For Weight Loss: స్థూలకాయులకు గుడ్ న్యూస్- ఈ చిట్కాతో వెంటనే బరువు తగొచ్చు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More