Home> హెల్త్
Advertisement

Fatty Liver: ఫ్యాటీ లివర్ ను తగ్గించే ఉసిరి.. ఇలా వాడితే చాలు!

మన శరీర విధులను నిర్వహించటంలో కాలేయం ముఖ్య పాత్ర వహిస్తుంది. కాలేయానికి ఏం జరిగిన సరే.. అది శరీర ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటి కాలేయ సమస్యలను తగ్గించుకోటానికి ఉసిరి తింటే చాలు.. ఆ వివరాలు.. 

Fatty Liver: ఫ్యాటీ లివర్ ను తగ్గించే ఉసిరి.. ఇలా వాడితే చాలు!

Healthy Liver: కాలేయం లేదా లివర్ మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం. కాలేయం మన శరీరంలో ఒకేసారి అనేక విధులను నిర్వహిస్తుంది. ఆహార జీర్ణం, ఇన్ఫెక్షన్ కారకాలతో పోరాడటం.. శరీరానికి హానిచేసే విషపదార్థాలను బయటకి పంపటం మరియు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం వంటి పనులను నిర్వహిస్తుంది. అంతేకాకుండా కొవ్వు ని తగ్గించటం మరియు కార్బోహైడ్రేట్లు నిల్వ చేయటం వంటి వాటికి సహాయపడుతుంది. ఒకవేళ కాలేయానికి చిన్న సమస్య కలిగిన దాని ప్రభావం ఆరోగ్యానికి ప్రభావితం చేస్తుంది. భారతదేశానికి చెందిన ప్రముఖ ఆరోగ్య నిపుణులు నిఖిల్ వాట్స్ కాలేయం ఆరోగ్యానికి ఎంత అవసరమో ఒక జర్నల్ లో తెలిపారు. 

సాధారణంగా ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తుల్లో కాలేయ ఆరోగ్యాన్ని చాలా వరకు ప్రభావితం చేస్తుంది. కొంత మందిలో జన్యుపరమైన కారణాల వలన కూడా కాలేయ సమస్యలు మొదలవుతాయి. ఇలా కాలేయ సమస్యలు ఉన్న వారు కొన్ని ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకోవటం వలన కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. సాధారణంగా మనం వాడే ఉసిరి కూడా కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

ఉసిరి తినడం వల్ల కలిగే లాభాలు  
ఉసిరిని సాధారణంగా జుట్టు మరియు చర్మం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. నిజానికి ఉసిరి ఫ్యాటీ లివర్ సమస్యతో పోరాడడానికి నుండి కూడా ఉపయోగపడుతుంది. ఉసిరిలో పుష్కలంగా ఉండే విటమిన్ C రోగ నిరోధక శక్తిని పెంచటమేకాకుండా.. అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కలిగిస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్న వారికి ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది. 

Also Read: Samsung Galaxy F23 5G మొబైల్‌పై 37% తగ్గింపు..బ్యాంక్‌ ఆఫర్స్‌తో కేవలం రూ. 4,099కే పొందండి!   

కాలేయానికి ఉపయోగపడే ఉసిరి 
ఉసిరి మన శరీరానికి ఒక సూపర్ ఫుడ్ అనటంలో ఎలాంటి అతిశ్రేయోక్తి లేదు. మధుమేహం, అజీర్ణం, కంటి సమస్యలు మరియు కాలేయ బలహీనత వంటి సమస్యలతో పోరాడడానికి ఉసిరి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది మెదడుని బల పరచడంతో పాటు కాన్సర్ వంటి సమస్యల నుండి రక్షణని కలిగిస్తుంది. ప్రతి రోజు ఉసిరి తినేవారు  గుండె సంబంధిత సమస్యల గురవ్వటం చాలా తక్కువ. విషపదార్థాలను బయటకి పంపించడంలో కూడా ఉసిరి తోడ్పడి.. కాలేయానికి ఒక రక్షణగా ఉంటుంది. అంతేకాకుండా ఉసిరి వల్ల శరీరంలో హైపర్లిపిడెమియా మరియు మెటబాలిక్ సిండ్రోమ్ వంటివి కూడా తగ్గుతాయి. 

ఉసిరిని ఎలా తింటే ఆరోగ్యం.. ?
ఉసిరిని అనేక రకాలుగా మనం తినవచ్చు.. అన్నిటికంటే సులభమైన విధానం.. ఉసిరిని నేరుగా నమిలి మింగేయటం. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు ఉసిరిని నల్ల ఉప్పుతో కలిపి తింటే మంచిది. .  దీనితో పాటు రోజు ఉదయం లేవగానే ఉసిరి టీని తాగాలి.. రోజు ఇలా తాగడం ద్వారా కొన్ని రోజుల్లోనే ఫలితం లభిస్తుంది.

Also Read: Road Accidents in AP: రెండు ఘోర ప్రమాదాలు.. తొమ్మిది మంది దుర్మరణం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More