Home> హెల్త్
Advertisement

Heart Attack: డైట్‌లో ఈ మార్పులు చేస్తే చాలు..గుండె వ్యాధులకు మందులు కూడా అవసరం లేదు

Heart Attack: గుండెపోటు చాలా ప్రమాదకరమైంది. ఒక్కోసారి వెంటనే ప్రాణాలు తీసేస్తుంది. అందుకే గుండెపోటు సమస్య ఉన్నప్పుడు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. డైట్‌లో కొన్ని మార్పులు చేస్తే తప్పకుండా గుండెపోటు ముప్పు తగ్గుతుంది.
 

Heart Attack: డైట్‌లో ఈ మార్పులు చేస్తే చాలు..గుండె వ్యాధులకు మందులు కూడా అవసరం లేదు

దేశంలో ప్రతియేటా గుండెపోటు సమస్య పెరుగుతోంది. ప్రతియేటా మరణించేవారిలో ఎక్కువగా గుండెపోటు కారణంగా ఉంటోంది. అయితే రోజువారీ ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులతో హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం..

ఇండియాలో ప్రతియేటా 28 వేల కంటే ఎక్కువ మరణాలు కేవలం హార్ట్ ఎటాక్ కారణంగా ఉంటున్నాయి. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. అదే సమయంలో 30-35 ఏళ్ల వయస్సులో హార్ట్ ఎటాక్ సమస్య మరింత పెరుగుతోంది. అందుకే హార్ట్ ఎటాక్ సమస్య ఉన్నవాళ్లు..ఆహారపు అలవాట్లపై పూర్తి శ్రద్ధ పెట్టాలి. డైట్‌పై శ్రద్ధ పెట్టకపోతే..భవిష్యత్తులో సమస్య రావచ్చు. అందుకే డైట్‌లో ఏమేం చేర్చాలి, ఏవి దూరం పెట్టాలనేది తెలుసుకుందాం..

హార్ట్ ఎటాక్ నుంచి కోలుకోవడం ఎలా

ముందుగా ఫైబర్ ఫుడ్ డైట్‌లో చేర్చుకోవాలి. దీనివల్ల కొలెస్ట్రాల్ శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇది కాకుండా సీజనల్ కూరగాయలు, డైటరీ ఫైబర్ తప్పకుండా ఉండాలి.

గుండె వ్యాధి సమస్యలున్నవాళ్లు స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి. ఇప్పటికే హార్ట్ ఎటాక్ వచ్చి ఉంటే ఇక స్మోకింగ్ పూర్తిగా మానేయాలి. దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి. వ్యాయామం లేకపోతే నాళికల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. దాంతోపాటు కార్డియోవాస్క్యులర్ వ్యాధుల ముప్పు పెరుగుతుంది. 

వాల్‌నట్స్, ఫ్లెక్స్ సీడ్స్ , అవకాడో వంటి ఆహార పదార్ధాలు తినాలి. ఎందుకంటే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తాయి.

ప్రతి 100 గ్రాముల ఫ్లెక్స్ సీడ్స్‌లో 20 శాతం ప్రోటీన్లు, 28 శాతం ఫైబర్, 18 శాతం మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్ 73 శాతం పోలీ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. 

ఇవి కాకుండా తులసి పాలు కూడా మంచి ప్రయోజనకరం. గుండెరోగులకు చాలా లాభదాయకం. తులసి పాలను ఉడికించి తాగాలి. సీజనల్ వ్యాధుల్నించి రక్షించుకోవాలి.

Also read: Skin Care Tips: చలికాలంలో చర్మం నిర్జీవంగా మారిపోతుందా, ఇవి అప్లై చేస్తే చాలు చిటికెలో సమస్య మాయం

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More