Home> హెల్త్
Advertisement

Dates for Diabetic Patients: డయాబెటిస్ ఉన్నవారు ఖర్జూర పండ్లు తొనొచ్చా..? తింటే ఏం అవుతుంది..?

Dates for Diabetes Patients: ఆధునిక జీవన విధానంలో డయాబెటిస్ అతి ప్రమాదకర వ్యాధిగా మారింది. దేశంలోనే కాదు..ప్రపంచమంతా అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధి ఇది. జీవన శైలి సరిగ్గా లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం.

Dates for Diabetic Patients: డయాబెటిస్ ఉన్నవారు ఖర్జూర పండ్లు తొనొచ్చా..? తింటే ఏం అవుతుంది..?

Dates for Diabetic Patients: డయాబెటిస్‌కు ఇప్పటివరకూ శాశ్వత చికిత్స లేదు. కేవలం మందులతో లేదా డైటింగ్‌తో నియంత్రణ మాత్రమే ఉంది. అందుకే డయాబెటిస్ సోకినప్పుడు ఆహారపు అలవాట్లపై ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. ఏది తినాలి, ఏది తినకూడదనేది ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. ఈ క్రమంలో ఖర్జూరం విషయంలో చాలామందికి సందేహాలుంటాయి. ఆ వివరాలు మీ కోసం..

ఖర్జూరం అనేది అన్ని సీజన్లలో లభించే రుచికరమైన ఫ్రూట్. అత్యధిక ప్రోటీన్లు కలిగిన ఫ్రూట్ ఇది. చాలామంది ఇష్టంగా తింటుంటారు. ఇందులో న్యూట్రిషన్ల విలువ అధికం కావడంతో వైద్యులు కూడా రోజూ ఖర్జూరం తినమని సూచిస్తుంటారు. అయితే ఇది రుచిలో స్వీట్‌నెస్ ఎక్కువగా ఉండే ఫ్రూట్ కావడంతో డయాబెటిస్ రోగులు తినవచ్చా లేదా అనే విషయంలో చాలామందికి సందేహాలుంటాయి. ప్రముఖ న్యూట్రిషియనిస్టులు చెప్పిందాని ప్రకారం ఖర్జూరంలో ఫైబర్ ఎక్కువగా ఉన్నందున మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా మంచిది.

ఖర్జూరంలో పోషక పదార్ధాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా డైటరీ ఫైబర్ కావల్సినంత ఉంటుంది. దీంతోపాటు విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ బి6, విటమిన్ కే , కాపర్, మెగ్నీషియం, మాంగనీస్, నియాసిన్, ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆరోగ్యపరంగా కూడా ఖర్జూరం చాలా మంచిది. ఖర్జూరం రోజూ తినే అలవాటుంటే చాలా రకాల వ్యాధుల దరిచేరవు. ఎందుకంటే రోగ నిరోధక శక్తి వేగంగా పెరుగుతుంది. 

Also Read: Diabetes Diet: మధుమేహం తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడే పదార్ధమిదే

ఖర్జూరంలో లభించే డైటరీ ఫైబర్ రక్తంలో చక్కెర కరిగే వేగాన్ని తగ్గిస్తుంది. దాంతో షుగర్ లెవెల్స్ పెరిగే ముప్పు ఉండదు. ఇతర డ్రై ఫ్రూట్స్‌తో కలిపి తింటే ఆకలి కూడా చాలా సేపటి వరకు వేయదు. దాంతో స్థూలకాయం సమస్య కూడా తగ్గించవచ్చు. అదే సమయంలో ఖర్జూరం గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. అందుకే ఖర్జూరం తిన్నా సరే బ్లడ్ షుగర్ ఒకేసారి పెరగడమనేది జరగదు. డయాబెటిస్ రోగులు రోజుకు 2 ఖర్జూరం పండ్లు నిస్సంకోచంగా తినవచ్చు. ఒకవేళ ఆరోగ్యం సరిగ్గా లేకుంటే మాత్రం వైద్యుని సలహా మేరకు తీసుకోవాలి. ఖర్జూరంతో పాటు ఓట్స్, కినోవా తీసుకుంటే శరీరానికి ఫైబర్ మరింత ఎక్కువగా లభిస్తుంది. 

ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఖర్జూరం తినడం వల్ల ఇందులో ఉండే మెగ్నీషియం కారణంగా ఎముకలు బలంగా మారతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవు. అధిక రక్తపోటు సమస్య ఉండేవాళ్లు ఖర్జూరం తప్పకుండా తినాల్సి ఉంటుంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది.

Also Read: Nutrition Deficiency: విటమిన్ డి నుంచి విటమిన్ బి12 వరకూ 5 ముఖ్యమైన న్యూట్రిషన్ లోపాల్ని ఎలా అధిగమించాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More