Home> హెల్త్
Advertisement

Diabetes Symptoms: ఉదయం లేచిన వెంటనే ఈ లక్షణాలు కన్పిస్తే ఆ వ్యాధి కావచ్చు

Diabetes Symptoms: శరీరంలో కలిగే అంతర్గత మార్పులు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. అంతర్గతంగా ఏదైనా వ్యాధి ఉంటే..కొన్ని లక్షణాలు బయటకు కన్పిస్తుంటాయి. అలాంటప్పుడు అప్రమత్తం కావల్సిందే.
 

Diabetes Symptoms: ఉదయం లేచిన వెంటనే ఈ లక్షణాలు కన్పిస్తే ఆ వ్యాధి కావచ్చు

ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే నీళ్లు తాగాలన్పిస్తే..నోరెండిపోయినట్టుంటే మీకు ఆ వ్యాధి ఉందని అర్ధం. కొంతమందికి ఉదయం లేచిన వెంటనే అలసటగా ఉంటుంది. ఈ లక్షణాలన్నీ డయాబెటిస్‌కు సంకేతాలు. ప్రీ డయాబెటిస్ వ్యాధి ఉన్నప్పుడు కూడా కొన్ని లక్షణాలు బయటపడతాయి.

ఉదయం లేచిన వెంటనే ఈ లక్షణాలున్నాయా

1. ఒకవేళ ఉదయం లేచిన వెంటనే గొంతు ఎండిపోయినట్టుగా ఉంటే, ముఖం ఎండినట్టుంటే డయాబెటిస్ ఉందని అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ లక్షణాలు కేవలం డయాబెటిస్ వ్యాధిగ్రస్థుల్లోనే కన్పిస్తాయి.

2. ఒకవేళ రాత్రి నిద్రపోయిన తరువాత కూడా ఉదయం లేచిన వెంటనే అలసటగా ఉంటే లేదా లేవాలన్పించకపోతే డయాబెటిస్ వ్యాధి లక్షణం కావచ్చు. ఈ లక్షణం రోజూ కన్పిస్తే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. 

3. ఒకవేళ ఉదయం లేచిన తరువాత మసక మసకగా ఉండి ఏదీ సరిగ్గా కన్పించకపోతే ఇది కూడా మధుమేహం వ్యాధి లక్షణమే. శరీరంలో బ్లడ్ షుగర్ పెరిగి, చిన్న రక్త వాహికలకు నష్టం కలుగుతుంది. ఫలితంగా మసక మసకగా కన్పిస్తుంటుంది. 

4. ఉదయం లేచిన తరువాత మీ బాడీ అంతా దురదగా ఉంటే ప్రత్యేకించి చర్మం, ముఖం లేదా జననాంగాల వద్ద దురద ఉంటే డయాబెటిస్ సమస్య ఉందని అర్ధం.

5. ఉదయం లేచిన వెంటనే శరీరంలో తిమ్మిరిగా అన్పిస్తే..ఇది కూడా డయాబెటిస్ లక్షణాల్లో ఒకటి. ఈ పరిస్థితుల్లో వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. 

Also read: Weight Loss Tips: నిద్రపోయేముందు ఈ 6 పనులు చేస్తే..కేవలం 10 రోజుల్లో అధిక బరువుకు చెక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More