Home> హెల్త్
Advertisement

Diabetes Control Tips: మధుమేహం తగ్గడానికి ఉదయాన్నే లేచిన తర్వాత ఈ 8 పనులు చేయండి!

8 Tips For Diabetes Control: మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ ఉదయం లేచిన తర్వాత ఈ 8 చిట్కాలు పాటించడం వల్ల సులభంగా చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తీవ్ర మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.  

Diabetes Control Tips: మధుమేహం తగ్గడానికి ఉదయాన్నే లేచిన తర్వాత ఈ 8 పనులు చేయండి!

8 Tips For Diabetes Control: రోజులు మారుతున్న కొద్ది జీవనశైలిలో కూడా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అంతేకాకుండా చాలా మంది ఈ క్రమంలో అనారోగ్యకరమైన ఆహారాలు కూడా తీసుకుంటున్నారు. అయితే దీని కారణంగా దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, శరీర బరువు పెరగడం, రక్త పోటు సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యలు రావడానికి  ఒత్తిడి కూడా కారణమేనని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మధుమేహం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారంపై శ్రద్ధ తీసుకోవడమేకాకుండా, ఒత్తిడికి దూరంగా ఉండడం చాలా మంచిదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

అంతేకాకుండా డయాబెటిస్‌తో ఇబ్బందులు పడేవారు రోజువారీ దినచర్యలో కూడా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. జీవన శైలిలో మార్పులు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కాబట్టి ఆధునిక జీవనశైలిని అనుసరించకపోవడం చాలా మంచిది. అంతేకాకుండా మధుమేహం ఉన్నవారు రోజూ ఉదయం ఈ పనులు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు.

నిద్రలేచిన వెంటనే ఈ పనులు చేయాలి:
>>డయాబెటిస్‌ పేషెంట్స్‌ ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో రక్తంలో చక్కెర స్థాయిని తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది.
>>ఒకవేళ రక్తంలో చక్కెర పరిమాణాలు ఎక్కువగా ఉంటే మెంతి గింజలతో నీటిని ఖాళీ కడుపుతో తాగాల్సి ఉంటుంది.
>>అల్పాహారాన్ని తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగే ఛాన్స్‌ కూడా ఉంది.
>>మధుమేహంతో బాధపడుతున్నవారు పరగడుపున కాకరకాయ రసాన్ని తాగడం వల్ల కూడా రక్తంలో చక్కెర పరిమాణాలు సులభంగా నియంత్రించుకోవచ్చు.
>>రోజూ మార్నింగ్ వాక్ చేయడం వల్ల కూడా మధుమేహాన్ని సులభంగా నియంత్రించుకోవచ్చు. అంతేకాకుండా ఊబకాయం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
>>డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్నవారు తినే ఆహారంలో ఎక్కువ ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
>>అల్పాహారం తర్వాత డాక్టర్ సూచించిన మందులను స్కిప్ చేయకుండా ప్రతిరోజూ తీసుకోవాలి.
>>ఉదయం నిద్రలేచిన వెంటనే బ్రషింగ్‌తో పాటు ఆయిల్ పుల్లింగ్ చేయండి.

ఇది కూడా చదవండి : Ponguleti Srinivas Reddy: ఢిల్లీకి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కీలక ప్రకటన రానుందా ?

ఇది కూడా చదవండి : Bandi Sanjay: సంతకాల్లేకుండా ప్రధానికి లేఖలు.. అసలు విషయం బయటపెట్టిన బండి సంజయ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Read More