Home> హెల్త్
Advertisement

Diabetes Control Tips: డైట్‌లో ఈ మూడు మసాలా దినుసులుంటే..మధుమేహం ఎంత ఉన్నా ఇట్టే తగ్గిపోతుంది

Diabetes Control Tips: మధుమేహం నియంత్రించేందుకు డైట్‌లో మార్పులు ఉంటే చాలావరకూ పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా కొన్ని మసాలా దినుసుల్ని డైట్‌లో చేర్చుకుంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

Diabetes Control Tips: డైట్‌లో ఈ మూడు మసాలా దినుసులుంటే..మధుమేహం ఎంత ఉన్నా ఇట్టే తగ్గిపోతుంది

దేశంలోనే కాదు..ప్రపంచమంతా మధుమేహం కేసులు పెరుగుతున్నాయి. మందుల్లేకుండా ఈ వ్యాధిని నియంత్రించడం కష్టంగా మారుతోంది. అయితే చిన్న చిన్న మార్పుల ద్వారా డయాబెటిస్ నియంత్రించవచ్చు.

డయాబెటిస్ నియంత్రించేందుకు కిచెన్‌లో లభించే కొన్ని వస్తువులు చాలు. ఇంట్లో ఉండే మసాలా దినుసుల్ని డైట్‌లో భాగంగా చేసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించుకోవచ్చు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవల్సింది మెంతుల గురించి. మెంతి గింజలు మధుమేహానికి చాలా ఉపయోగకరం. మెంతుల్లో ఫైబర్, యాంటీ బయోటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మెంతులతో షుగర్ నియంత్రణలో ఉంటుంది. మెంతుల్ని నానబెట్టి తీసుకుంటే చాలా లాభదాయకం. అయితే ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

నల్ల మిరియాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు డయాబెటిస్ నియంత్రణకు దోహదపడతాయి. నల్ల మిరియాల పౌడర్, పసుపు కలిగి తాగితే మంచిది. భోజనానికి గంట ముందు ఇది తీసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయి.

దాల్చినచెక్క

దాల్చినచెక్కలో చాలా ఔషద గుణాలున్నాయి. డయాబెటిస్‌కు దాల్చినచెక్క చాలా మంచిది. దాల్చినచెక్కతో చేసే కాడా షుగర్‌ను నియంత్రిస్తుంది. దాల్చినచెక్కను పసుపు, మెంతులతోకలిపి పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్‌ను రోజూ పరగడుపున వేడి నీళ్లతో తీసుకోవలి. డయాబెటిస్ నియంత్రణకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. 

డైట్ ఎలా ఉండాలి

డయాబెటిస్ నియంత్రించేందుకు డైట్‌పై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎందుకంటే తినే ఆహారం నేరుగా బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను పెంచుతుంది. డయాబెటిస్ నియంత్రణలో ఉండాలంటే...కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. లో గ్లైసెిక్ ఇండెక్స్, హై ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే పదార్ధాలు తీసుకోవల్సి ఉంటుంది. 

Also read: Skin Care Tips: ఎండలో, చలిలో ముఖం పాడవుతుందా, అద్భుతమైన చిట్కాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More