Home> హెల్త్
Advertisement

Cucumber Juice Benefits: దోసకాయ జ్యూస్ ట్రై చేయండి... ఈ వ్యాధులకు చెక్ పెట్టండి

Cucumber Juice Benefits: దోసకాయ జ్యూస్ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయిు. దీనిని ఆహారంలో చేర్చుకుంటే అనేక రకాల వ్యాధులు దూరమవుతాయి. 
 

Cucumber Juice Benefits: దోసకాయ జ్యూస్ ట్రై చేయండి... ఈ వ్యాధులకు చెక్ పెట్టండి

Cucumber Juice Benefits For Health:  మీరు వేసవిలో దోసకాయను ఎక్కువగా తింటారు. కానీ దాని జ్యూస్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని మీకు తెలుసా. దోసకాయ జ్యూస్ (Cucumber Juice) ను ఆహారంలో చేర్చుకుంటే అనేక రకాల వ్యాధులు దూరమవుతాయి. రక్తపోటును నియంత్రించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో  దోహాదపడుతోంది. దోసకాయ జ్యూస్ కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

బరువును తగ్గిస్తుంది
దోసకాయ జ్యూస్ లో అనేక విటమిన్లు, మినరల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అందుకే దోసకాయ జ్యూస్ తాగితే బరువు (weight loss) తగ్గుతారు. 

ఒత్తిడి స్థాయిని తగ్గిస్తుంది
దోసకాయ జ్యూస్ లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, ఇది రక్తపోటును (blood pressure) నియంత్రిస్తుంది.  అంతేకాకుండా ఒత్తిడిని తగ్గించడంతో పాటు మంచి నిద్రను పొందడంలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో దోసకాయ గింజలు కూడా సహాయపడతాయని కొన్ని పరిశోధనలలో వెల్లడైంది.

చర్మానికి ఎంతో మేలు
దోసకాయలో విటమిన్ కె, సిలికా ఉంటాయి. మిమ్మల్ని ఫిట్‌గా ఉంచడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యం ఉంచడంలో ఇది సహాయపడుతోంది.  దోసకాయ రసంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది వాపును తగ్గిస్తుంది.

కళ్లకు ఉపయోగకరం
దోసకాయ జ్యూస్ కళ్ళకు చాలా ఉపయోగకరం. నిజానికి ఈ జ్యూస్ కళ్లకు చల్లదనాన్ని ఇస్తుంది. దోసకాయ రసంలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ.. రెటీనాలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా కంటి చూపును మెరుగుపరుస్తుంది.

ఉదర సంబంధిత సమస్యలకు చెక్
మీకు గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం, ఛాతీలో చికాకు వంటి కడుపు సంబంధిత సమస్యలు ఉంటే.. మీరు తప్పనిసరిగా దోసకాయ జ్యూస్ ను ప్రయత్నించాలి. దీన్ని తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

Also Read: Muskmelon Benefits: కర్బూజతో ఎన్నో ప్రయోజనాలు.. వేసవి తాపాన్ని తట్టుకోవాలంటే ఇలా చేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Read More