Home> హెల్త్
Advertisement

Covid19 Cases in india: దేశంలో మళ్లీ కరోనా భయం, 10 వేలు దాటిన కోవిడ్ యాక్టివ్ కేసులు

Covid19 Cases in india: దేశంలో కరోనా వైరస్ చాపకిందనీరులా విస్తరిస్తోంది. కరోనా కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 10 వేల మార్క్ దాటేశాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Covid19 Cases in india: దేశంలో మళ్లీ కరోనా భయం, 10 వేలు దాటిన కోవిడ్ యాక్టివ్ కేసులు

Covid19 Cases in india: ఊహించినట్టే దేశానికి ఇప్పుడు జూన్ భయం వెంటాడుతోంది. గత వారం రోజుల్నించి కరోనా మహమ్మారి కేసులు పెరుగుతుండటం ఇందుకు కారణం. జూన్ నాటికి దేశంలో పీక్స్‌కు చేరవచ్చనే భయం వెంటాడుతోంది. కోవిడ్ సంక్రమణ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు జారీ చేసింది. 

దేశంలో గత వారం రోజులుగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. వరుసగా రెండవరోజు 18 వందలకు పైగా కేసులు నమోదవడం గమనార్హం. దేశంలో గత 24 గంటల్లో 1890 కొత్త కేసులు నమోదు కాగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 10 వేల మార్క్ దాటింది. అదే సమయంలో గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా 6 మంది మరణించారు. గత వారం రోజుల్లో దేశవ్యాప్తంగా 8,781 కొత్త కేసులు నమోదయ్యాయి. 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం కోవిడ్ యాక్టివ్ కేసులు 10,300 ఉన్నాయి. కోవిడ్ రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,30,837కు చేరుకుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లో గత 24 గంటల వ్యవధిలో ఒక్కొక్కరు కరోనా కారణంగా మరణించారు. కేరళలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. రోజువారీ కోవిడ్ పాజిటివిటీ రేటు 3.19 శాతానికి, వీక్లీ పాజిటివిటీ రేటు 1.39 శాతానికి చేరుకుంది. గత 24 గంటల్లో కోవిడ్ రికవరీలు 932 మంది ఉన్నారు. 

దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమౌతోంది. ఇప్పటికే ప్రదాని నరేంద్రమోదీ అధ్యక్షతన కోవిడ్ సంక్రమణ నివారణ చర్యలు, ప్రస్తుత పరిస్థితులపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇవాళ మరోసారి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కేంద్ర ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనుంది.

Also read: Pink Salt Benefits: పింక్ సాల్ట్ అంటే ఏంటి, సాధారణ ఉప్పుతో పోలిస్తే కలిగే 5 ప్రయోజనాలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More