Home> హెల్త్
Advertisement

Remedies For Cold And Cough: దగ్గు, జలుబుతో బాధపడుతున్నవారు ఈ చిట్కాను ట్రై చేయండి!

Treatment For Cold And Cough: శీతాకాల సమయంలో చిన్న పిల్లల నుంచి పెద్దలు వరకు దగ్గు, జలుబు సమస్య బారిన పడుతుంటారు.  అయితే దగ్గు, జలుబు అనేది ప్రమాదకరమైన వ్యాధలు కాకపోయిన ఇవి ఒకరి నుంచి మరొకరికి వెంటనే సోకే ప్రమాదం ఉంటుంది. 

Remedies For Cold And Cough: దగ్గు, జలుబుతో బాధపడుతున్నవారు ఈ  చిట్కాను  ట్రై చేయండి!

Treatment For Cold And Cough: వర్షాకాలం, చలికాలంలో దగ్గు, జలుబు వంటి సమస్యల తరచుగా ఇబ్బంది పెడుతాయి. దీని కారణంగా శరీరం అలసటగా, నీరసంగా ఉంటుంది. ఈ లక్షణాల వల్ల చురుకుగా పని చేయలేకపోతాం. అయితే ఆరోగ్యనిపుణులు సలహాతో పాటు కొన్ని ఇంటి చిట్కాలను పాటించిడం వల్ల ఈ దగ్గు, జలబు నుంచి ఉపశమనం పొందవచ్చు.

చలికాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుంటాయి. సాధారణంగా దగ్గు,జలుబు నివారణ కోసం  సిరప్ లు ఉపయోగిస్తాం.దీని వల్ల  కొంత కాలం వరకు ఉపశమనం పొందవచ్చు. కానీ ఈ చిట్కాలను పాటిస్తే వెంటనే ఉపశమనం పొందవచ్చు. అయితే కొన్ని రకాల పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది.

తులసి ఆకులు:

తీవ్రమైన దగ్గు, జలుబు సమస్యతో బాధపడుతున్నవారు తులసి రసం తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు. ముందుగా తులసి ఆకుల రసం తీసుకొని ఇందులో తేనె కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. 

నూనె-కర్పూరం:

దగ్గు ఎక్కువగా ఉంటే గొంతు నొప్పి సమస్య తలెత్తుతుంది.  దీని కోసం రెండు స్పూన్‌ల నూనె ఒక పెద్ద స్పూన్ కర్పూరం కలిపి తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.

తమలపాకు:

దగ్గు తీవ్రంగా ఉన్నప్పుడు తమలపాకులు వేడి చేసి దీని రసాన్ని తేనెలో కలుపుకొని తీసుకోవాలి. 

యూకలిప్టస్:

యూకలిప్టస్ తీసుకోవడం వల్ల పొడి దగ్గు సమస్య తగ్గుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులను మరిగించి తర్వాత వడగట్టి ఇందులో పంచదార కలిపి మూడు పూటలా తాగితే దగ్గు తగ్గుతుంది.

Also Read  Stomach Cancer Symptoms: కడుపు కేన్సర్ తో సంగీత దర్శకుడు ఇళయరాజా కూతురి మృతి.. లక్షణాలు, చికిత్స విధానం తెలుసుకుందాం..

అల్లం-వెల్లుల్లి:

దగ్గు బాగా ఉనప్పుడు పాలలో అల్లం, వెల్లుల్లి రసం  తీసుకొని అందులో పసుపు వేసి తాగితే మంచి ఉపశమనం పొందవచ్చు. 

తిప్పతీగ:

కొంతమంది తరచు దగ్గుతో బాధపడు ఉంటారు. దీని కోసం తిప్పతీగ రసాన్ని నీళ్లులో కలిపి తీసుకోవడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.

తేనె, దాల్చిన్ చెక్క:  

ఈ మూడిటిని పొడి చేసి పాలలో, నీటిలో  ఉదయం, సాయంత్రం తాగితే ఉపశమనం పొందవచ్చు.

శోంఠి:

అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. శొంఠిని తేనెలో కలిపి తీసుకంటే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం దొరుకుతుంది.

దానిమ్మ రసం:  

దానిమ్మ రంసంలో కొంచె అల్లం పొడి, పిప్పాలి పొడిని కలిపి తీసుకోవాలి. దీని  రెండు పూటలా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.

లవంగాలు:

నోట్లో  లవంగాలను వేసుకొని చప్పరిస్తూ గొంతు గర గర తగ్గుతుంది.

వామును:

వామును నమిలి చప్పరించడం వల్ల దగ్గును తగ్గిస్తుంది.

మిరియాల:  

తేనలో చిటికడు మిరియాల పొడి కలిపి తాగితే దగ్గు, జలుబు నయం అవుతుంది.

Also Read Spring Onion: ఉల్లి కాడలతో ఎన్నో ప్రయోజనాలు.. షుగర్‌ సమస్యకు చెక్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More