Home> హెల్త్
Advertisement

Coronavirus: ఇరుకు సందుల్లో.. వేగంగా నడుస్తున్నారా ? కరోనా ప్రమాదం పొంచి ఉంది?

Coronavirus: ఇరుకు సందుల్లో.. వేగంగా నడుస్తున్నారా ? కరోనా ప్రమాదం పొంచి ఉంది?

Covid-19 Research | కరోనావైరస్ ప్రమాదం ఇంకా పొంచి ఉంది. ఇలాంటి సమయంలో చిన్న చిన్న కారణాల వల్ల కూడా వైరస్ సంక్రమించే అవకాశం ఉంటుంది. తాజాగా ఇలాంటి మరొక కారణాన్ని కనుగొన్నారు పరిశోధకులు. వైరస్ డ్రాప్లెట్స్ కొంత దూరం గాలితో పాటు ప్రయాణించి ఇతరులకు సంక్రమించే అవకాశం ఉంది అని చెబుతున్నారు రీసెర్చర్స్. 

Also Read | Coronavirus Vaccine కోసం Co-WIN యాప్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం

కోవిడ్-19 (Covid-19) వైరస్ సోకిన వ్యక్తుల హైటు అంత దూరం అవి ప్రయాణించగలవు. అందుకే సోషల్ డిస్టెన్సింగ్ పాటించమని చెబుతున్నారు వైద్యులు. తాజాగా చిన్న వైశాల్యం ఉన్న సందుల్లో నడిచేవారికి, ముఖ్యంగా పిల్లలకు సంక్రమించే అవకాశం ఉంటుంది అంటున్నారు. దాంతో పాటు వేగంగా నడించి వెళ్లేవారికి రిస్కు ఎక్కువగా ఉంటుంది అని తెలిపారు.

Also Read | Shirshasana : ప్రెగ్నెన్సీలో శీర్షాసనం మంచిదేనా? చదవండి!

గుంపుల ముందు నుంచి లేదా గుంపుల మధ్యలోంచి వెళ్లే సమయంలో అది కూడా స్పీడుగా వెళ్లే సమయంలో ఈ ప్రమాదం మరింత రెట్టింపు అవుతుంది అన్నారు. కంప్యూటర్ సిమ్యులేటర్ ప్రకారం ఈ నివేదిక ప్రచురించినట్టు తెలిపింది ఒక పరిశోధకుల టీమ్. సిమ్యులేటర్‌లో వైరస్ లోడ్ ఎంత దూరం ప్రయాణిస్తుందో.. అది ఎవరికి కరోనావైరస్ (Coronavirus) వేగంగా సోకే ప్రమాదం ఉందో తెలిపారు పరిశోధకులు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More