Home> హెల్త్
Advertisement

COPD Disease: స్మోకింగ్ మానకపోతే..మీ ఊపిరితిత్తులు ఇలా అయిపోతాయి జాగ్రత్త

COPD Disease: ధూమపానం ఆరోగ్యానికి హానికరం. కేన్సర్ కారకం అని ప్రకటనలు చూస్తూనే ఉంటాం. ఆఖరికి కొనే సిగరెట్ ప్యాకెట్‌పై కూడా అదే ఉంటుంది. అయినా మానలేని పరిస్థితి. సిగరెట్ స్మోకింగ్ దుష్పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో తెలుసుకుందాం..
 

COPD Disease: స్మోకింగ్ మానకపోతే..మీ ఊపిరితిత్తులు ఇలా అయిపోతాయి జాగ్రత్త

స్మోకింగ్ అలవాటు  ఉండేవారికి సీవోపీడీ వంటి లంగ్స్ సంబంధిత వ్యాధికి గురవుతుంటారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి.. ఏ విధంగా కాపాడుకోవచ్చనేది పరిశీలిద్దాం..

క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మొనరా డిసీజ్ స్థూలంగా సీఓపీడీ. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. ఈ వ్యాధి కారణంగా ఊపిరితిత్తులు కుదించుకుపోతుంటాయి. ఫలితంగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. దాంతో శరీరం నుంచి కార్బన్ డై ఆక్స్డైడ్ బయటకు వెలువడదు. సీవోపీడీ కారణంగా గుండెపోటు, ఊపిరితిత్తుల కేన్సర్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ముఖ్యంగా ఈ వ్యాధి మహిళలకు ఎక్కువగా సోకే ప్రమాదముంది. సీవోపీడీ లక్షణాలేంటి, ఎందుకొస్తుంది, ఎలా విముక్తి పొందాలనేది తెలుసుకుందాం..

సీవోపీడీ లక్షణాలు

సీవోపీడి లక్షణాలు సాధారణంగా చాలా ఆలస్యంగా బయటపడతాయి. సీవోపీడీలో ప్రధాన లక్షణం దీర్ఘకాలం పాటు దగ్గు ఉండటం లేదా కఫం పేరుకుపోవడం. ఈ వ్యాధి ఉన్నప్పుడు ఆ వ్యక్తి రోజంతా దగ్గుతో ఇబ్బంది పడుతుంటాడు. ఒకవేళ మీరు 4-8 వారాల్నించి దగ్గుతో ఇబ్బంది పడుతుంటే సీవోపీడీ లక్షణం కావచ్చు. ఈ వ్యాధి ఉన్నప్పుడు అకారణంగా బరువు తగ్గిపోవడం గమనించవచ్చు. మరోవైపు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా మెట్లెక్కడంలో అలసట ఎదురౌతాయి. ఊపిరితిత్తుల బలహీనంగా ఉండటాన్ని సూచిస్తాయి. సీవోపీడీ ఉంటే..కఫం పసుపు లేదా పచ్చగా ఉంటుంది. 

సీవోపీడీతో పాటు ఈ వ్యాధుల ముప్పు

సీవోపీడీ సమస్యతో బాధపడేవారికి జలుబు, ఫ్లూ వంటివి త్వరగా సోకుతకాయి. సీవోపీడీ  రోగులల్లో గుండె వ్యాధుల ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. సీవోపీడీ రోగుల్లో బ్లడ్ ప్రెషర్, ఊపిరితిత్తుల కేన్సర్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుంది. 

ఎలా రక్షించుకోవాలి

ఈ వ్యాధి నుంచి కాపాడుకునేందుకు కొన్ని వస్తువులున్నాయి. వీటిని లైఫ్‌స్టైల్‌లో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. సిగరెట్ ఎక్కువగా స్మోక్ చేసేవారిలో ఈ వ్యాధి ప్రమాదం ఎక్కువ. ఈ వ్యాధి నుంచి విముక్తి పొందేందుకు ముందుగా స్మోకింగ్ మానేయాలి. దుమ్ము ధూళి, కెమికల్స్‌కు దూరంగా ఉండాలి. చిన్న చిన్న విషయాలపై ఫోకస్ పెట్టడం ద్వారా ఈ వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు.

Also read: Quitting Sugar: పంచదార పూర్తిగా మానేస్తే ఏమౌతుంది, మధుమేహం ఉంటే ఎలా మరి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More