Home> హెల్త్
Advertisement

Constipation: గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యల నుంచి ఇలా 15 నిమిషాల్లో ఉపశమనం పొందండి..

Constipation Home Remedies: చాలా మంది ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలతో బాధపడుతున్నవారు ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 

Constipation: గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యల నుంచి ఇలా 15 నిమిషాల్లో ఉపశమనం పొందండి..

Constipation Home Remedies: ప్రస్తుతం చాలా మంది ఆధునిక జీవన శైలిని అనుసరించడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య బారిన పడుతున్నారు. దీంతో పాటు మలబద్ధకం, పొట్టలో మంట ఇతర వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఈ వ్యాధుల నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ పొట్ట సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందగడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. ఆ చిట్కాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బొప్పాయితో పొట్ట సమస్యలకు చెక్:
బొప్పాయి అనేక వ్యాధులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే పొట్ట సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా ఈ పండు ప్రభావవంతంగా పని చేస్తుంది.బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ పండు  పొట్ట సమస్యలున్నవారు తింటే సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్, ప్రొటీన్, పొటాషియం, విటమిన్లు జీర్ణక్రియన మెరుగుపరచడానికి సహాయపడతాయి. 

ఓట్ మీల్ తప్పని సరి:
ఈరోజు చేసే అల్పాహారంలో ఓట్‌మీల్‌ను తప్పని సరిగా చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో పోషకాలు శరీరంలోని అనారోగ్య సమస్యలను తగ్గించడానికి కృషి చేస్తాయి. అంతేకాకుండా ఇందులో ఫోలేట్, రాగి, మాంగనీస్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఐరన్, ఫైబర్ , బీటా గ్లూకోజ్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి మంచి ప్రయోజనాలు  కలుగుతాయి. ముఖ్యంగా మలబద్ధకం వంటి పొట్ట సమస్య దూరమవుతాయి.

అవిసె గింజలు:
అవిసె గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఆహారాల్లో వినియోగిస్తే బరువు తగ్గడమేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే ప్రతి రోజూ అవిసె గింజలను వినియోగించడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ కూడా మెరుగుపడి..పొట్ట సమస్యలు కూడా తగ్గుతాయి. 

Also Read: Rain Alert For AP: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు  

Also Read: LIC Scheme: వృద్ధాప్యంలో ఖర్చుల టెన్షన్.. ఈ పాలసీ తీసుకుంటే ప్రతి నెలా పెన్షన్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More