Home> హెల్త్
Advertisement

Anemia: ఎండు కొబ్బరి లడ్డుతో రక్తహీనత, రక్తపోటు సమస్యలకు 8 రోజుల్లో చెక్‌..!


Coconut Ladoo For Anemia: ప్రస్తుతం చాలామంది రక్తహీనత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం పూట ఆయుర్వేద నిపుణులు సూచించిన కొబ్బరి తురుముతో తయారు చేసిన ఈ లడ్డును ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో గుండె గుణాలు తీవ్రవ్యాధుల నుంచి కూడా శరీరాన్ని రక్షిస్తాయి.

 Anemia: ఎండు కొబ్బరి లడ్డుతో రక్తహీనత, రక్తపోటు సమస్యలకు 8 రోజుల్లో చెక్‌..!

Coconut Ladoo For Anemia: ఆధునిక జీవనశైలిని అనుసరించే చాలామందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కొంతమంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడితే మరికొంతమంది రక్తపోటు, రక్తహీనత, నరాల బలహీనత వంటి సమస్యలకు లోనవుతున్నారు. శరీరంలో ఇలాంటి సమస్యల బారిన ఒక్కసారి పడితే జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి రక్తహీనత, రక్తపోటు సమస్యలను ఎంత సులభంగా వీలైతే.. అంత సులభంగా తగ్గించుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికోసం ఆయుర్వేద నిపుణులు సూచించిన ఔషధములకాలు కలిగిన లడ్డూలను ప్రతిరోజు తినాల్సి ఉంటుంది అందులో ఉండే గుణాలు రక్తహీనతను తగ్గించడమే.. కాకుండా చర్మ సమస్యలను కూడా తగ్గిస్తాయని ఆయుర్వేద నిపుణులు పేర్కొన్నారు.

ఎండు కొబ్బరి మిశ్రమంతో కలిగిన ఈ లడ్డును ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి శక్తి లభించి సులభంగా శరీర బరువు కూడా పెరగవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో షుగర్ వినియోగించకుండా చేసుకొని తినడం వల్ల మధుమేహంతో బాధపడుతున్న వారు కూడా రక్తంలోని చక్కర పరిమాణాలను నియంత్రించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఈ ఔషధ గుణాలు కలిగిన లడ్డును రుచిగా ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

రుచిగా ఎండు కొబ్బరి లడ్డు తయారు చేయటానికి కావలసిన పదార్థాలు:
అర కప్పు బెల్లం తురుము
అర కప్పు గోధుమపిండి
అర కప్పు నెయ్యి
పావు కప్పు యాలకులు
పావు కప్పు పిస్తా, పుచ్చకాయ, బాదాం డ్రై ఫ్రూట్స్
ఒక కప్పు కొబ్బరి తురుము
ఒక కప్పు ఎండు ఖర్జూరాలు
నాలుగు యాలకులు

ఈ ల‌డ్డూ త‌యారీ విధానం:
ముందుగా స్టవ్ వెలిగించుకుని దానిపైన బౌల్ పెట్టుకొని ఎండుకొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ బౌల్లో వేసుకొని బయటికి స్మెల్ వచ్చేదాకా బాగా వేయించాల్సి ఉంటుంది. ఇలా వేయించిన కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసుకొని ఫైన్ గా పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే వేడి చేసిన బౌల్లో డ్రై ఫ్రూట్స్, యాలకులను కూడా స్మైల్ వచ్చేదాకా వేయించి మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పై మరో బౌల్ ను పెట్టుకొని గోధుమపిండిని రెండు నిమిషాల పాటు వేయించాల్సి ఉంటుంది ఇలా వేయించే క్రమంలో నెయ్యి వేస్తూ బాగా కలుపుతూ మంచి రంగులో వచ్చేటట్లు కలుపుతూ వేయిస్తూ ఉండాలి. ఇలా వేయించిన పిండిలో డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.

ఇలా అన్ని మిశ్రమాలు కలిపిన తర్వాత స్టవ్ పై మరో బౌల్ పెట్టుకొని అందులో రెండు చెంచాల నెయ్యిని వేసి బాగా వేడి చేయాల్సి ఉంటుంది. అందులోనే బెల్లం తురుము వేసి ఎలాంటి ఉండలు లేకుండా పూర్తిగా కరిగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత లడ్డు ఆనకం వచ్చేదాకా బెల్లం మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమంలో పైన వేయించి పెట్టుకున్న అన్నింటిని వేసి బాగా కలపాల్సి ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత కొంచెం చల్లార్చుకుని చిన్న లడ్డూల్లా కట్టుకొని ప్రతిరోజు ఒకటి నుంచి రెండు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలైనా రక్తహీనత రక్తపోటు సమస్యలు సులభంగా తగ్గుతాయి.

Also Read:  Aditya Roy Kapoor Lady Fan : మీద మీదకు వచ్చి ముద్దు పెట్టబోయిన ఆంటీ.. స్టార్ హీరో పరిస్థితి ఎలా అయిందంటే?

Also Read: Samantha Ruth Prabhu on Rana : ఆగలేకపోతోన్నా!.. వెంకీమామా, రానాలపై సమంత ప్రేమ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Read More