Home> హెల్త్
Advertisement

Cholesterol Precautions: కొలెస్ట్రాల్ సమస్యను కేవలం నెలరోజుల్లో మాయం చేసే 4 ఆయుర్వేద చిట్కాలు

Cholesterol: ఆధునిక జీవన విధానం చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంటుంది. కొలెస్ట్రాల్ ఇందులో అతి ముఖ్యమైంది. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ వివిధ రకాల వ్యాధులకు కారణమౌతుంది.  అయితే ఆయుర్వేద చిట్కాలతో  కొలెస్ట్రాల్‌ను సులభంగా తగ్గించవచ్చు.

Cholesterol Precautions: కొలెస్ట్రాల్ సమస్యను కేవలం నెలరోజుల్లో మాయం చేసే 4 ఆయుర్వేద చిట్కాలు

ఆహారపు అలవాట్లు, జీవనశైలి బాగున్నంతవరకూ ఏ విధమైన సమస్యలు తలెత్తవు. ఆరోగ్యం ఉంటుంది. అందుకే శరీరాన్ని ఎప్పుడూ ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉంచుకోవడం అవసరం. కొలెస్ట్రాల్ ఎలా తగ్గించాలి, ఆయుర్వేద చిట్కాలేంటనేది తెలుసుకుందాం..

కొలెస్ట్రాల్ అనేది చాలా ప్రమాదకరం. ఇందులో రెండు రకాలుంటాయి. గుడ్ కొలెస్ట్రాల్ , బ్యాడ్ కొలెస్ట్రాల్. శరీరం ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలంటే సరైన మోతాదులో గుడ్ కొలెస్ట్రాల్ అవసరమౌతుంది. కానీ కొలెస్ట్రాల్ పరిమితి దాటితే అధిక రక్తపోటు, డయాబెటిస్, హార్ట్ ఎటాక్ ముప్పు అధికమౌతుంది. చెడు జీవనశైలి, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య అధికంగా కన్పిస్తోంది. మీరు కూడా హై కొలెస్ట్రాల్‌తో బాధపడుతుంటే..ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు 4 సులభమైన ఆయుర్వేద చిట్కాలున్నాయి. 

ధనియా ప్రయోజనాలు

భారతీయుల ప్రతి కిచెన్‌లో ధనియాలు తప్పకుండా ఉంటాయి. ధనియాల పౌడర్ వంటల్లో ఎక్కువగా వినియోగిస్తుంటాం. అదే సమయంలో కొత్తిమీర వాడకం కూడా ఎక్కువగా ఉంటుంది. ధనియాలు బెస్ట్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అని చాలామందికి తెలియదు. ధనియాల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. ఫలితంగా బాడీ డీటాక్స్ ప్రక్రియ వేగవంతమౌతుంది. ఫలితంగా హై కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 

శరీరంలో కఫం పెరిగిందంటే.. కొలెస్ట్రాల్ సమస్య ఎక్కువగా ఉందని అర్ధం. కొలెస్ట్రాల్ కారణంగా దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు చుట్టుముడతాయి. ఈ సమస్య ఉన్నప్పుడు ముందుగా కఫం నియంత్రించాలి. మసాలా, ఆయిలీ ఫుడ్స్ దూరంగా ఉంచాలి. ఆహారం బ్యాలెన్స్‌గా ఉంటే..కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. 

కొలెస్ట్రాల్ తగ్గించేందుకు మెంతి గింజలను ఔషధంగా వినియోగిస్తారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఆరోగ్యానికి చాలా మంచివి. మెంతి గింజల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. అందుకే శరీరంలో కొలెస్ట్రాల్ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు మెంతి గింజలు క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

ఇక చివరిగా వ్యాయామం. శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించేందుకు యోగా లేదా వ్యాయామం చాలా అవసరం. మీ శరీరంలో కొలెస్ట్రాల్ సమస్య ఉంటే ప్రాణాయామం, శీర్షాసనం, మయూరాసనం వంటి ఆసనాలు వేయాలి. ఎక్కువ సేపు శ్వాస తీసుకునే బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేయాలి. 

Also read: Joint Pain Relief : జామ కషాయంతో కీళ్ల నొప్పులే కాకుండా ఈ తీవ్ర వ్యాధులకు శాశ్వతంగా చెక్‌ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More