Home> హెల్త్
Advertisement

Cholesterol Control Tips: బ్రౌన్ రైస్‌తో కూడా చెడు కొలెస్ట్రాల్‌, గుండె పోటు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..

Cholesterol Control With Brown Rice: భారత్‌లో అందరూ తెల్ల బియ్యాన్ని అధిక పరిమాణంలో తీసుకుంటారు. అయితే దీనిని రోజుకు మూడు పూటలు తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కావున వీటికి బదులుగా  బ్రౌన్ రైస్ తినాలని డైటీషియన్లు సూచిస్తున్నారు.

Cholesterol Control Tips: బ్రౌన్ రైస్‌తో కూడా చెడు కొలెస్ట్రాల్‌, గుండె పోటు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..

Cholesterol Control With Brown Rice: భారత్‌లో అందరూ తెల్ల బియ్యాన్ని అధిక పరిమాణంలో తీసుకుంటారు. అయితే దీనిని రోజుకు మూడు పూటలు తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కావున వీటికి బదులుగా  బ్రౌన్ రైస్ తినాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. ఇందులో శరీరనికి కావాల్సిన చాలా రకాల పోషకాలుంటాయి. కాబట్టి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడమేకాకుండా.. దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా బరువును వేగంగా తగ్గిస్తుంది. క్యాన్సర్, వేగంగా బరువు పెరగడం, శరీరం నొప్పి, మధుమేహం మొదలైన సమస్యలు పాలిష్ చేసిన తెలుపు బియ్యం తినడం వల్ల వస్తున్నాయి. బ్రౌన్ రైస్ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

బ్రౌన్ రైస్ వల్ల కలిగే ప్రయోజనాలు:

గుండెను దృఢంగా చేస్తాయి:
గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్ తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. వీటిని రోజూ తింటే.. గుండెపోటు, గుండె ఆగిపోవడం వంటి తీవ్రమైన వ్యాధులు అదుపులో ఉంటాయి.  అంతేకాకుండా బరువు పెరగడం వంటి సమస్యలు దూరమవుతాయి.

కొలెస్ట్రాల్‌ స్థాయిలను నియంత్రిస్తుంది:
బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పరిమాణాలు సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా  కడుపులోని విష పదార్థాలు మలంలోంచి బయటకు వస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి బ్రౌన్ రైస్ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే మూలకాలు రక్తంలో చక్కెర పరిమాణాలను కూడా నియంత్రిస్తుంది.

క్యాన్సర్‌ కణాలను నివారిస్తుంది:
క్యాన్సర్‌ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు బ్రౌన్ రైస్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు క్యాన్సర్‌ను పూర్తిగా నివారిస్తాయి. కావున ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా బ్రౌన్ రైస్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More