Home> హెల్త్
Advertisement

Cholesterol Control Foods: ఎంతటి కొలెస్ట్రాలైనా ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా చెక్‌ పెట్టొచ్చు..

Cholesterol Control Tips: ప్రస్తుతం చాలా మంది చెడు కొలెస్ట్రాల్‌ సమస్యల బారిన పడి గుండె పోటు సమస్యలకు గురవుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఆహారంలో పలు రకాల చట్నీలు తీసుకోవాల్సి ఉంటుంది.

Cholesterol Control Foods: ఎంతటి కొలెస్ట్రాలైనా ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా చెక్‌ పెట్టొచ్చు..

Cholesterol Control Chutney: చెడు జీవనశైలి కారణంగా చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలను అతిగా తింటున్నారు. దీంతో చిన్న వయస్సుల్లోనే గుండెపోటు సమస్యల బారిన పడుతున్నారు. అయితే శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా కూడా గుండె పోటు సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మందపాటి కొలెస్ట్రాల్‌ శరీరంలో రక్త నాళాలలో పేరుకుపోయి వివిధ రకాల ప్రాణాంతక సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా రక్త సరఫర కూడా తగ్గి గుండెపోటు సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

కొలెస్ట్రాల్‌ తగ్గడానికి ఈ చట్నీని తీసుకోవాల్సి ఉంటుంది:
ఈ చట్నీ చేయడానికి, 20 గ్రాముల వెల్లుల్లి, 20 గ్రాముల పుదీనా, 15 గ్రాముల ఇసాబ్గోల్, 10 మి.లీ నిమ్మరసం, 50 గ్రాముల కొత్తిమీర, 1 పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, 15 గ్రాముల లిన్సీడ్ ఆయిల్ తీసుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటిని తురుము పీటపై రుబ్బుకుని ఈ గ్రీన్ చట్నీని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రుబ్బుకునే క్రమంలో తప్పకుండా వాటిని బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని మిశ్రమంగా చేసుకుని తాలింపు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఆకులలో క్లోరోఫిల్ ఉంటుందా?:

కొత్తిమీర, పుదీనా ఆకుపచ్చ ఆకులలో క్లోరోఫిల్ అధిక పరిమాణంలో లభిస్తుంది. ఇది శరీరంలోని జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. వీటిలో సమృద్ధిగా ఉండే ప్రొటీన్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడతాయి. దీని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి శరీరాన్ని ఫిట్‌గా చేసుకోవడానికి తప్పకుండా ఈ చట్నిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.

ఇసాబ్గోల్ మరియు లిన్సీడ్ యొక్క ప్రయోజనాలు
ఈ చట్నీలో ఇసబ్గోల్, అవిసె గింజలు కలిపి తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మధుమేహం నుంచి శరీరాన్ని రక్షించి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. దీని కారణంగా శరీరంలో రక్తం, ఆక్సిజన్ సరఫరా పెరగడం ప్రారంభమవుతుంది.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read:  Ashu Reddy : జనాలకు నా బ్యాక్ అంటేనే ఇష్టం!.. అషూ రెడ్డి ముదురు కామెంట్లు

Also Read: Kiara Advani Wedding Pics : కియారా అద్వాణీ సిద్దార్థ్ మల్హోత్రల పెళ్లి.. రామ్ చరణ్ కామెంట్ ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Read More