Home> హెల్త్
Advertisement

Cardamon: రాత్రి పాలలో యాలకులు, పసుపు కలుపుకుని తాగితే ఎన్ని లాభాలో!!

Cardamon In Milk Benefits: ప్రతిరోజు రాత్రి పడుకొనే ముందు యాలకుల పొడితో పాటు పసుపును కలుపుకొని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి బోలెడు లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం.

Cardamon: రాత్రి పాలలో యాలకులు, పసుపు కలుపుకుని తాగితే ఎన్ని లాభాలో!!

Cardamon In Milk Benefits: రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి అని మనందరికీ తెలిసిందే. గోరువెచ్చని పాలు తాగడం వల్ల మంచి నిద్ర కలుగుతుంది. అయితే ఈ గోరువెచ్చని పాలల్లో ఇతర పదార్థాలు కలిపి తాగడం వల్ల మరిన్ని లాభాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా యాలకుల పొడి, పసుపు కలుపుకొని తాగడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకీ లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం. 

పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా తయారు చేయడంలో ఎంతో సహాయం పడుతుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పనిచేస్తుంది. చిటికెడు యాలకుల పొడి కలపడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అందులో మొదటిది  ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తీవ్రమైన ఒత్తిడిని తగ్గిస్తాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు పసుపు కలుపుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరానికి విశ్రాంతి అందజేస్తాయి.  అంతేకాకుండా జలుబు దగ్గు వంటి సాధారణ సమస్యలను నుంచి ఉపశమనం కలుగుతుంది. 

కఫంతో బాధపడేవారు ఈ యాలకుల పాలను తాగడం వల్ల సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే కీళ్ళనొప్పులు, కండరాల సమస్యలతో బాధపడే వారు కూడా ఈ పాలు తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగలు ఉన్నాయి. గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి  సమస్యలతో బాధపడే వారికి పసుపు, యాలకులతో చేసిన పాలు తాగడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.  అయితే పసుపు, యాలకుల పాలను ఎలా తయారు చేసుకోవాలి. 

కావలసిన పదార్థాలు:

1 గ్లాసు పాలు (సాధారణంగా కడిగి శుభ్రం చేసిన పాలు ఉపయోగిస్తారు)
1/4 నుంచి 1/2 టీస్పూన్ పసుపు పొడి
2-3 యాలకులు (పొడి చేసి లేదా అలాగే వాడవచ్చు)
1 చిటికెడు నల్ల మిరియాల పొడి 
తేనె లేదా బెల్లం (రుచికి తగినంత)

తయారీ విధానం:

 ఒక చిన్న పాత్రలో పాలను వేసి మంట మీద వేడి చేయండి. పాలు కాస్త కాచి కుడుతున్నప్పుడు తగ్గించి, సిద్ధంగా ఉంచండి. మరిగించిన పాలలో పసుపు పొడి, యాలకులు (పొడి చేసి లేదా అలాగే), నల్ల మిరియాల పొడి వేసి బాగా కలపండి. రుచికి తగినంత తేనె లేదా బెల్లం కలిపి మరోసారి బాగా కలపండి. వెచ్చగా లేదా గోరువెచ్చగా ఈ పాలను తాగవచ్చు.

 

Also Read: Heart Attack: ప్రతిరోజు ఈ పండ్లు తింటే గుండెపోటు రమ్మన్నా రాదు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More