Home> హెల్త్
Advertisement

Best Drink For Health: ఈ పదార్థాలు కలిపి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్‌!

 Tomato Carrot Cucumber Juice:  మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే పచ్చి ఆకు కూరలు, పండ్లు వంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. 

Best Drink For Health: ఈ పదార్థాలు కలిపి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్‌!

Tomato Carrot Cucumber Juice: పచ్చి ఆకు కూరలు, కూరగాయాలు మనం శరీరానికి ఎంతో అవసరం. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. దీని వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. ముఖ్యంగా క్యారెట్‌, టమాట, కీరదోస తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో అవసరం. వీటిలో విటమిన్‌, మినరల్స్‌ అధికంగా ఉంటాయి. దీని వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మీరు కూడా వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలు వీటిని తీసుకోవడం చాలా అవసరం. దీని వల్ల వారి పెరుగుద ఆరోగ్యంగా ఉంటుంది. 

క్యారెట్, కీర‌దోస‌, ట‌మాటాల‌ను క‌లిపి జ్యూస్ గా చేసుకుని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని, అందాన్ని సొంతం చేసుకోవ‌చ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ  పదార్థాలతో మీరు జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు తగ్గ‌వ‌చ్చు. ర‌క్తంలో షుగర్‌ లెవెల్స్‌ కూడా అదుపులో ఉంటాయి. శ‌రీరానికి త‌క్ష‌ణ శక్తి ల‌భిస్తుంది.

ఈ జ్యూస్‌ తీసుకోవడం వల్ల ఎముకలు , కండ‌రాలు బ‌లంగా, ధృడంగా త‌యార‌వుతాయి.  అలాగే గుండె సంబంధిత‌ స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా కాపాడుతుంది. క్యాన్స‌ర్ ల బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో కూడా ఈ జ్యూస్ మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. అంతేకాకుండా క్యారెట్, కీర దోస, టమాటాల‌తో జ్యూస్ ను చేసుకుని తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా త‌యార‌వుతుంది. పిల్ల‌లు, పెద్ద‌ల వ‌ర‌కు ఎవ‌రైనా ఈ జ్యూస్ ను తాగ‌వ‌చ్చు.

వీటిని ప్రతిరోజు నేరుగా కూడా తీసుకోవచ్చు. పిల్లలు నేరుగా తినడానికి ఇష్టపడరు కాబట్టి వారికి మీరు జ్యూస్‌ చేసి ఇవ్వడం వల్ల సమస్య తగ్గుతుంది. మీరు ఈ కూరగాయాలను ఆహారం భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు పొందుతారు. అంతేకాకుండా మీ చర్మం, శరీరంలో ఎన్నో మార్పలు కనిపిస్తాయి. చరుకుగా కూడా ఉంటారు.  అలాగే  కంటి చూపు మెరుగుపడుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి జీర్ణ‌సంబంధిత స‌మ‌స్యలు కూడా త‌గ్గుతాయి. 

ఒక కీర‌దోస‌ను, ఒక పెద్ద క్యారెట్ ను, ఒక పెద్ద ట‌మాటాను తీసుకోవాలి. త‌రువాత వీటిని శుభ్ర‌ప‌రిచి ముక్క‌లుగా చేసుకోవాలి. ఒక జార్ లోకి ముక్కలను తీసుకోవాలి. ఇందులో త‌గినంత తేనె, పావు టీ స్పూన్ ఉప్పు, ఒక గ్లాస్ నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గ్లాస్ లోకి తీసుకుని స‌ర్వ్ చేసుకోవాలి.  ఈ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల శ‌రీర ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

 

 

 

 

 

 

 

 

Read More