Home> హెల్త్
Advertisement

Breast Cancer: ఈ విత్తనాలు రోజూ తీసుకుంటే బ్రెస్ట్ కేన్సర్ సైతం అరికట్టవచ్చా, నిజానిజాలేంటి

Breast Cancer: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా ఇంకా కొన్ని వ్యాధులకు పూర్తిగా చికిత్స లేదు. అందులో అత్యంత ప్రమాదకరమైంది, ప్రాణాంతకమైంది కేన్సర్. అయితే అన్ని కేన్సర్‌లు ప్రాణాంతకం కావు. కొన్నింటికి చికిత్స సాధ్యమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Breast Cancer: ఈ విత్తనాలు రోజూ తీసుకుంటే బ్రెస్ట్ కేన్సర్ సైతం అరికట్టవచ్చా, నిజానిజాలేంటి

Breast Cancer: ప్రపంచవ్యాప్తంగా మనిషిని ఇప్పటికీ గజగజ వణికిస్తున్నది కేన్సర్ మాత్రమే. ఇందులో బ్రెస్ట్ కేన్సర్ ఒకటి. మహిళలు అత్యధికంగా బ్రెస్ట్ కేన్సర్ బారిన పడుతుంటారు. ప్రకృతిలో లభించే కొన్ని పదార్ధాలతో బ్రెస్ట్ కేన్సర్ నివారణ చేయవచ్చంటున్నారు నిపుణులు. 

బ్రెస్ట్ కేన్సర్‌ను సాధారణంగా మహిళలకు శత్రువుగా అభివర్ణిస్తారు. అత్యధికంగా మహిళలకే చుట్టుముట్టే వ్యాధి ఇది. దీన్నించి రక్షించుకునేందుకు కొన్ని హోమ్ రెమిడీస్ కూడా చాలాసార్లు మంచి ఫలితాలనిస్తుంది. ఫ్లక్స్ సీడ్స్ ఇందుకు ఉదాహరణ. ఫ్లక్స్ సీడ్స్ బ్రెస్ట్ కేన్సర్ నిర్మూలనలో అద్భుతమైన ఫలితాలనిస్తుందంటారు. ఫ్లక్స్ సీడ్స్ మంచి పోషక పదార్దం. ఫ్లక్స్ సీడ్స్‌తో ప్రయోజనాలు అత్యధికం. ఫ్లక్స్ సీడ్స్‌ను చాలా రకాల వంటల్లో ఉపయోగిస్తుంటారు. కూరలు, పెరుగు వంటివాటిలో కలుపుతారు.

ఫ్లక్స్ సీడ్స్‌లో న్యూట్రియంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్ సి, ఐరన్, విటమిన్ బి, ఫోలేట్, ఫాస్పరస్, మెగ్నీషియం కావల్సినంతగా ఉంటాయి. అందుకే ఫ్లక్స్ సీడ్స్‌ను ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమంటారు. 

బ్రెస్ట్ కేన్సర్ నివారణలో ఫ్లక్స్ సీడ్స్ 

బ్రెస్ట్ కేన్సర్‌పై ఫ్లక్స్ సీడ్స్ చూపించే ప్రభావంపై ఇటీవల పలు అధ్యయనాలు వెలువడ్డాయి. ప్రత్యేకించి ఫ్లక్స్ సీడ్స్, బ్రెస్ట్ కేన్సర్ మధ్య ఉన్న సంబంధంపై జరిపిన పరిశోధనలో ఆసక్తి కల్గించే అంశాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలు ఆశ్చర్యపరిచాయి. 

ఫ్లక్స్ సీడ్స్ క్రమం తప్పకుండా తీసుకుంటే బ్రెస్ట్ కేన్సర్ ముప్పు తగ్గవచ్చని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. ఫ్లక్స్ సీడ్స్‌లో ఉండే ఫైబర్, లిగ్నాన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాల వల్ల కేన్సర్ కారకాల్ని నిరోధిస్తాయి. ఫ్లక్స్ సీడ్స్ వల్ల చాలా ఇతర ప్రయోజనాలున్నాయి. కేన్సర్ విషయంలో ఫ్లక్స్ సీడ్స్ ఒక్కటే తక్షణ పరిష్కారం మాత్రం కానేకాదు. 

మీ వయస్సు, జెనెటిక్స్ మెడికల్ హిస్టరీ, జీవనశైలి, రోజువారీ అలవాట్లు ఇలా చాల అంశాలు బ్రెస్ట్ కేన్సర్ పెరుగుదలకు కారణమౌతుంటాయి. రోజూ క్రమం తప్పకుండా ఫ్లక్స్ సీడ్స్ , ఫ్లక్స్ సీడ్స్ ఆయిల్ రెండూ ఉపయోగిస్తే బ్రెస్ట్ కేన్సర్ నియంత్రణకు సాధ్యమౌతుంది. 

Also read: Drinking Water Tips: రాత్రి వేళ నీళ్లు తాగడం మంచిదా కాదా, ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More