Home> హెల్త్
Advertisement

Bra and Breast Cancer: బ్రా ధరించడం వల్ల బ్రెస్ట్ కేన్సర్ వస్తుందా, నిజానిజాలేంటి

Bra and Breast Cancer: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల వ్యాధులు ఎదురౌతున్నాయి. వీటిలో కేన్సర్ అత్యంత ప్రమాదకరమైంది, ప్రాణాంతకమైంది. ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ది చెందినా ఇప్పటికీ కేన్సర్ అంటే భయపడే పరిస్థితి.
 

Bra and Breast Cancer: బ్రా ధరించడం వల్ల బ్రెస్ట్ కేన్సర్ వస్తుందా, నిజానిజాలేంటి

Bra and Breast Cancer: కేన్సర్ అనేది వాస్తవానికి చాలా రకాలుగా ఉంటుంది. ఈ కేన్సర్ రకాల్లో మహిళల్లోనే కన్పించే ప్రాణాంతకమైంది బ్రెస్ట్ కేన్సర్. బ్రెస్ట్ కేన్సర్ గురించి చాలా అంశాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి బ్రా ధరిస్తే బ్రెస్ట్ కేన్సర్ వస్తుందనేది. మరి వాస్తవానికి ఇది ఎంతవరకూ నిజమో తెలుసుకుందాం..

మహిళ జీవితంలో కొన్ని వస్తువులు అంతర్భాగంగా ఉంటాయి. వాటిలో అతి ముఖ్యమైంది బ్రా. కొంతమంది నిత్యం అంటే 24 గంటలూ ధరిస్తుంటారు. కొంతమంది బయట్నించి ఇంటికి వచ్చిన వెంటనే తీసేస్తుంటారు. ఇంకొంతమంది రాత్రి పడుకునేటప్పుడు కూడా బ్రా ధరించే ఉంటారు. రాత్రి పడుకునేటప్పుడు బ్రా ధరించడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇదంతా పక్కనబెడితే రాత్రి వేళ అంటే పడుకునేటప్పుడు బ్రా ధరించడం వల్ల బ్రెస్ట్ కేన్సర్ ముప్పు పెరుగుతుందంటారు. ఇది ఎంతవరకూ నిజం మరి.

పడుకునేటప్పుడు బ్రా ధరిస్తే బ్రెస్ట్ కేన్సర్ వస్తుందని చెప్పడం సరికాదనేది ఆరోగ్య నిపుణులు చెప్పే మాట. స్థనాల్లో నొప్పిగా గట్టిగా ఉండటం అనేది బ్రెస్ట్ కేన్సర్ ప్రధాన లక్షణం. ఈ లక్షణం కన్పిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయిచుకోవాలి. స్థనం ఆకారంలో మార్పు లేదా స్థనంలో గడ్డ కట్టినట్టుండటంలో మార్పుల్ని పరిశీలించాలి. రాంగ్ సైజ్ బ్రా ధరించడం వల్ల స్థనాల్లో స్వెల్లింగ్, ఆకారం మార్పు, బాడీ పోశ్చర్ మార్పు, వీపు నొప్పి , చర్మ వ్యాధులు రావచ్చు. 

ఇంకొంతమందైతే బ్రా ఫిటింగ్ సరిగా లేని కారణంగా బ్రెస్ట్ కేన్సర్ వస్తుందంటారు. కానీ ఇది ఏమాత్రం నిజం కాదు. బ్రా ఫిటింగ్ సరిగా లేనప్పుడు అసౌకర్యం మాత్రమే కలుగుతుంది. ఊపిరి ఆడకుండా ఉంటుంది. అండర్ వేర్ లేదా బ్రా టైట్ ఫిట్ ధరించడం వల్ల రక్త సరఫరాలో ఆటంకం వచ్చి బ్రెస్ట్ కేన్సర్ ముప్పు పెరుగుతుందని చెప్పడం నిజం కాదు.

అండర్ వైర్ బ్రా ధరించడం వల్ల శరీరంలో లింఫ్ ఫ్లూయిడ్స్ వెనక్కి రాకుండా ఆటంకం కలగవచ్చు. లింఫోటిక్ సిస్టమ్‌ను సంకోచించేలా చేస్తుంది. ఫలితంగా స్తనం పరిమాణంలో విష పదార్ధాలు పేరుకుని కేన్సర్ ముప్పు పెరగవచ్చు.

పడుకునేటప్పుడు బ్రా ధరించడం వల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు. నిద్ర క్వాలిటీ దెబ్బతినవచ్చు. ఇది కాస్తా శారీరకంగా, మానసికంగా ప్రభావం చూపిస్తుంది. బ్రా ధరించి పడుకోవడం వల్ల చర్మానికి నష్టం కలగవచ్చు. చర్మంలో మంట ఉత్పన్నం కావచ్చు. ఫంగల్ ఇన్‌ఫెక్షన్ ఉంటుంది. స్తనంలో రక్త ప్రసరణకు ఆటంకం కలగవచ్చు. అంటే బ్రా ధరించడం వల్ల లేదా బ్రా ధరించి పడుకోవడం వల్ల బ్రెస్ట్ కేన్సర్ అనేది నిజం కాదు. కానీ ఇతర అసౌకర్యాలు రావచ్చు.

Also read: Green tea vs Black Coffee: గ్రీన్ టీ వర్సెస్ బ్లాక్ కాఫీల్లో ఏది బెటర్

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More