Home> హెల్త్
Advertisement

Uric Acid: కేవలం రూ.2తో యూరిక్ యాసిడ్‌ను తగ్గించుకోవచ్చు..ఎలాగో తెలుసా?

 
Betel Leaves For Uric Acid: యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ తమల పాకులను తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా పొట్ట సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.

Uric Acid: కేవలం రూ.2తో యూరిక్ యాసిడ్‌ను తగ్గించుకోవచ్చు..ఎలాగో తెలుసా?

Betel Leaves For Uric Acid: శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగితే.. గుండె, ఎముకలు తీవ్రంగా దెబ్బ తింటాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల ఇంటి నివారాణలు కూడా పాటిస్తారు. అంతేకాకుండా యూరిక్ యాసిడ్‌ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆయుర్వేద శాస్త్రంలో పేర్కోన్న తమలపాకులను కూడా వినియోగించాల్సి ఉంటుంది. యూరిక్‌ యాసిడ్‌ సమస్యలతో బాధపడేవారు ఈ ఆకులను తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..

యూరిక్ యాసిడ్ కారణాలు:
యూరిక్ యాసిడ్ సమస్యల బారిన పడడానికి ప్రధాన కారణాలు ఆధునిక జీవన శైలేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఊబకాయం, షుగర్ సమస్యలతో బాధపడుతున్నవారు వ్యాయామాలు చేయకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యల వస్తాయి. అంతేకాకుండా పలు రకాల ఆహారాలు విచ్చల విడిగా తినడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి.

యూరిక్ యాసిడ్‌ను ఇలా నియంత్రించండి:
యూరిక్ యాసిడ్ నియంత్రణకు తమలపాకులు చాలా మేలు చేస్తాయి. వాటి సారాల్లో ఉండే లక్షణాలు యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. కాబట్టి తీవ్ర యూరిక్‌ యాసిడ్‌ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ ఆకులను తీసుకోవాల్సి ఉంటుంది.

తమలపాకులను తీసుకోండి:
తమలపాకులను ప్రతి రోజూ నమలడం వల్ల యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా దీనిని సిరప్‌లా తయారు చేసి వినియోగించడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

ఈ ప్రయోజనాలు కూడా కలుగుతాయి:
తమలపాకుల్లో ఉండే గుణాలు గ్యాస్ట్రిక్, అల్సర్‌లను తగ్గించడానికి కూడా సహాపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి పొట్టకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. తమలపాకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కాబట్టి ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)    

Also read: Hero Bike-Scooters Sales 2023: హీరో ముందు అన్ని 'జీరో'లే.. 3.5 లక్షల బైక్-స్కూటర్లు అమ్ముడయ్యాయి!

Also read: Hero Bike-Scooters Sales 2023: హీరో ముందు అన్ని 'జీరో'లే.. 3.5 లక్షల బైక్-స్కూటర్లు అమ్ముడయ్యాయి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More