Home> హెల్త్
Advertisement

Benefits Of Walnuts: వేసవిలో వాల్‌నట్స్‌ బరువును నియంత్రిస్తాయా?, బెల్లీ ఫ్యాట్‌ తగ్గడానికి ఇలా తినొచ్చు!

Benefits Of Walnuts For Men: వేసవిలో వాల్‌నట్స్‌ను వివిధ రకాలుగా తినొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును కూడా నియంత్రిస్తాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు వాల్‌నట్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. 
 

 Benefits Of Walnuts: వేసవిలో వాల్‌నట్స్‌ బరువును నియంత్రిస్తాయా?, బెల్లీ ఫ్యాట్‌ తగ్గడానికి ఇలా తినొచ్చు!

Benefits Of Walnuts For Men: శరీరానికి డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో అధిక పరిమాణంలో పోషకాలు లభిస్తాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని రక్షిస్తాయి. అందరూ ఈ డ్రై ఫ్రూట్స్‌ను చలికాలంలో అతిగా తీసుకుంటారు. ఎందుకంటే శరీరానికి వేసవి కాలంలో కంటే చలి కాలంలోనే ఎక్కువ ప్రయోజనాలను కలిగిస్తాయి. అయితే ఎండ కాలంలో వాల్‌నట్స్ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.  వేసవిలో వాల్‌నట్స్‌ను సరైన క్రమంలో తింటే విపరీతమైన లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 

వేసవి కాలంలో వాల్‌నట్స్‌ను ఇలా తీసుకోండి:
పాలతో కలిపి కూడా వాల్‌నట్స్ తీసుకోవచ్చు:

వాల్‌నట్స్‌ను చాలా మంది నేరుగా తింటారు. అయితే ఇలాంటి తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారని, వీటిని పాలలో మరిగించి తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పాలలో పాటు వీటిని తినడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందొచ్చు. ఇందులో ఉండే గుణాలు తీవ్ర గుండె సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ వాల్‌నట్స్‌ను పాలలో తీసుకోవాల్సి ఉంటుంది. 

Also Read:  Agent Twitter Review : ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టిన అయ్యగారు

షేక్ లేదా స్మూతీ:
వాల్‌నట్స్‌ను షేక్ లేదా స్మూతీ తీసుకోవడం వల్ల కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని షేక్‌ రూపంలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వేసవిలో వచ్చే తీవ్ర అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వాల్‌నట్స్‌తో తయారు చేసిన స్మూతీని తీసుకోవాల్సి ఉంటుంది. 

వాల్‌నట్స్‌ను నానబెట్టి కూడా తినొచ్చు:
వాల్‌నట్స్‌ను వేసవి కాలంలో రాత్రంతా నీటిలో నానబెట్టి..ప్రతి రోజూ తీసుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును కూడా నియంత్రిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు, బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకునేందుకు తప్పకుండా వాల్‌నట్స్‌ను నానబెట్టి కూడా తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read:  Agent Twitter Review : ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టిన అయ్యగారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Read More