Home> హెల్త్
Advertisement

Turmeric Water: పరగడుపున పసుపు నీళ్లు తీసుకుంటే అద్భుత ప్రయోజనాలు.. ఒక్కసారి అలవాటైతే..!

Turmeric Water Benefits in morning: పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణుల చెబుతున్నారు. మన తరుచు పసుపును ఉపయోగించి వంటలు చేస్తాము. గాయాలు కూడా  ఇది ఒక గొప్ప ఔషధం. పరగడపును పసుపు నీళ్లు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం. 

Turmeric Water: పరగడుపున పసుపు నీళ్లు తీసుకుంటే అద్భుత ప్రయోజనాలు.. ఒక్కసారి అలవాటైతే..!

Turmeric Water Benefits in Morning: పసుపు మన ఇళ్లల్లో అందరికీ సుపరిచితమే. వంటల్లో వాడే పసుపు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. పసుపులో  ఉండే ఔషధ గుణాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్లు వంటి గుణాలను కలిగి ఉంటుంది. దీని ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం పరగడుపును ఒక గ్లాస్‌ నీళులో పసుపును కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. అయితే దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం.

పసుపు నీళ్ళు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇక్కడ ఉన్నాయి:

యాంటీఆక్సిడెంట్లు:

పసుపులోని కర్కుమిన్ అనే పదార్థం శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. ఫ్రీ రాడికల్స్ కణాలను నష్టపరిచి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. 

జీర్ణశక్తి:

పసుపు నీళ్ళు జీర్ణవ్యవస్థను శుభ్రపరిచి, జీర్ణశక్తిని పెంచుతుంది. ఉబ్బరం లాంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్:

పసుపు చెడుగు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్  స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

వాపు:

 పసుపులోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి వాపు సంబంధిత సమస్యలకు సహజ నివారణగా పనిచేస్తాయి.

రోగనిరోధక శక్తి:

పసుపు నీరు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఫలితంగా అనారోగ్యాలు దరిచేపట్టు ఉండవు.

చర్మం:

పసుపులోని యాంటీఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేయడంలో చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి.

విష నిర్మలన:

పసుపు నీటిలోని నిర్విషీకరణ లక్షణాలు శరీరం నుంచి విష పదార్థాలను తొలగించి, మొత్తం శుభ్రపరిచే ప్రక్రియను మెరుగుపరుస్తాయి.

మెదడు ఆరోగ్యం:

పసుపులోని కర్కుమిన్ మెదడులోని నరాల మార్గాలను రక్షించడానికి  మెమరీ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. 

షుగర్‌ కంట్రోల్‌: 

రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇన్సులిన్ సెన్సెటివీ పెరుగుతుంది. 

పెయిన్ కిల్లర్ గా:  

పసుపు నీళ్లు పెయిన్ కిల్లర్ గా కూడా పని చేస్తుంది.  దీని తాగడం వల్ల తలనొప్పి, కండరాల నొప్పులు తగ్గుతాయి. 

నెలసరి నొప్పి: 

స్త్రీలల్లో వచ్చే నెలసరి నొప్పి కూడా తగ్గుతుంది. 

గమనిక:

పసుపు నీళ్ళు తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కొన్ని దుష్ఫలితాలు కూడా కలుగుతాయి.  అందుకే, పసుపు నీళ్ళు తాగే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Also Read: LPG Cylinder Price Hike: ఫస్ట్‌రోజే సామాన్యులకు బిగ్ షాక్! ఎల్పీజీ గ్యాస్ ధరల పెంపు.. నగరాలవారీగా ధరలు ఎలా ఉన్నాయంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More