Home> హెల్త్
Advertisement

Avoid Foods In Monsoon: వర్షాకాలంలో ఈ ఫుడ్స్ అస్సలు తినకూడదు.. తస్మాత్‌ జాగ్రత్త..

Avoid Foods In Monsoon:  ఆరోగ్యకరమే కానీ ఇందులో బ్యాక్టీరియా ఫంగిసైడ్ త్వరగా పెరుగుతుంది. ఈ సీజన్ లో స్ప్రౌట్స్ తినకుండా ఉండాలి, బ్యాక్టీరియా అభివృద్ధి చెందే సీజన్ ఇది ఫుట్ పాయిజన్ ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

Avoid Foods In Monsoon: వర్షాకాలంలో ఈ ఫుడ్స్ అస్సలు తినకూడదు.. తస్మాత్‌ జాగ్రత్త..

Avoid Foods In Monsoon: వర్షాకాలం హాయిని ఇస్తుంది, వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే వర్షాకాలంలో ముఖ్యంగా నీటి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్లు రోగాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇవి జీర్ణ సమస్యలు ఇతర ఆరోగ్య సమస్యలను తీసుకువస్తాయి వర్షాకాలంలో తినకూడని ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.

స్ట్రీట్ ఫుడ్..
వర్షాకాలంలో ముఖ్యంగా పానీ పూరి వంటి ఆహారాలు, పకోడీ  రోడ్ సైడ్ లభించే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవి అంతగా పరిశుభ్రంగా ఉండవు. ఇందులో ఉపయోగించే నీరు కలుషితమయ్య అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీంతో ఇన్ఫెక్షన్లు అభివృద్ధి చెందుతాయి. అందుకే రోడ్ సైడ్ ఆహారాల జోలికి వెళ్ళకూడదు.

ఆకుకూరలు..
 పాలకూర ,క్యాబేజీ ఈ సీజన్లో తినకూడదు. ఇందులో బ్యాక్టీరియా అభివృద్ధి అవుతుంది. ఇది జీర్ణ సమస్యలు, ఇన్ఫెక్షన్లను తీసుకువస్తుంది. ఈ సీజన్లో బాగా శుభ్రం చేసిన కూరగాయల్ని తీసుకోవాలి.

స్ప్రౌట్స్..
ఆరోగ్యకరమే కానీ ఇందులో బ్యాక్టీరియా ఫంగిసైడ్ త్వరగా పెరుగుతుంది. ఈ సీజన్ లో స్ప్రౌట్స్ తినకుండా ఉండాలి, బ్యాక్టీరియా అభివృద్ధి చెందే సీజన్ ఇది ఫుట్ పాయిజన్ ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

సి ఫుడ్..
సి ఫుడ్ అనేది త్వరగా పాడవుతుంది. ఈ వర్షాకాలంలో నీళ్లు కలుషితమవుతాయి ఇవి సి ఫుడ్ కూడా డయేరియా, వాంతులు ఇతర బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు కారణం అవుతాయి. ఈ సీజన్లో ఇవి తినకపోవడమే మంచిది.

ఫ్రై ఫుడ్స్..
ఫ్రై చేసిన ఆహారాలు ముఖ్యంగా పకోడీ, సమోసా వంటి ఆహారాలు వర్షాకాలం సీజన్లో తినకూడదు. ఇది అజీర్తికి దారితీస్తుంది. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తిన్న ఫ్రై చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల బరువు కూడా ఈజీగా పెరుగుతారు కడుపులో కూడా జీర్ణ సమస్య  ఏర్పడుతుంది.

ఇదీ చదవండి: ఈ టీ జాయింట్ పెయింట్స్‌ను తగ్గించే ఎఫెక్టీవ్ రెమిడీ.. మ్యాజికల్ బెనిఫిట్స్‌ కలుగుతాయి..

పాల పదార్థాలు..
వర్షాకాలంలో పాలుతో పాటు ఇతర పాల పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఇందులో ఫుడ్‌ పాయిజన్‌కు కారణమయ్యే బ్యాక్టిరియా త్వరగా విస్తరిస్తుంది. కేవలం పాయిశ్చర్‌ చేసిన ఆహారాలను మాత్రమే ఉపయోగించాలి. అంటే యోగార్ట్‌, బట్టర్ మిల్క్ వంటివి మాత్రమే తీసుకోవాలి.

కట్ చేసిన ఆహారాలు..
ముఖ్యంగా కొంతమంది వీధుల్లో కట్ చేసిన ఆహారాలను విపరీతంగా ఉపయోగిస్తారు దాంట్లో బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది త్వరగా పాడవుతుంది. అయితే ఇవి ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తాయి ఎందుకంటే ఇన్ఫెక్షన్ త్వరగా విస్తరిస్తుంది.

ఇదీ చదవండి:  ఈ 5 ఆహారాలు మీకు హార్ట్ ఎటాక్ రాకుండా చేస్తాయి.. మీ డైట్ లో తప్పక ఉండాల్సినవి..
మిగిలిపోయిన ఆహారాలు..
ఇంట్లో వండుకున్న మిగిలిపోయిన ఆహారాలు తినకుండా ఉండాలి. ఇందులో బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఇది ఫుడ్ పాయిజన్ కి దారి చూస్తోంది ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి.

కీరదోసకాయ..
కుకుంబర్ వాటర్ మిలన్ లో ఎక్కువగా నీటి శాతం ఉంటుంది ఈ సీజన్లో శుభ్రం చేసి తినకపోతే ఇది కూడా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More