Home> హెల్త్
Advertisement

Constipation Loose Motion Relief: ఎలాంటి ఖర్చు లేకుండా మలబద్ధకం, లూజ్ మోషన్ నుంచి ఇలా తక్షణ ఉపశమనం..

Immediate Constipation Loose Motion Relief: వర్షం కారణంగా చాలా మందిలో డయేరియా లేదా లూజ్ మోషన్, మలబద్ధకం సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని హోం రెమెడీస్‌ను వినియోగించాల్సి ఉంటుంది.

Constipation Loose Motion Relief: ఎలాంటి ఖర్చు లేకుండా మలబద్ధకం, లూజ్ మోషన్ నుంచి ఇలా తక్షణ ఉపశమనం..

 

Immediate Constipation Loose Motion Relief: అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల పొట్ట సమస్యలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు రావొచ్చు..ఇక వానా కాలంలో తీసుకుంటే వాంతులతో పాటు విరేచాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఇన్ఫెక్షన్స్‌ వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మందిలో ఎసిడిటీ, మలబద్ధకం దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్నారు. కొంత మంది వీటి నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన ఔషధాలను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటికి బదులుగా ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్న కొన్ని హోమ్ రెమెడీస్ వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

తరచుగా మలబద్ధకం సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా నెయ్యితో తయారు చేసిన రెమెడీ వినియోగించాల్సి ఉంటుంది. దీనిని వినియోగించడం వల్ల సులభంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిని తయారు చేయడానికి ముందుగా ఒక చిన్న గ్లాసు తీసుకుని అందులో అందులో గోరు వెచ్చని నీటిని పోసుకుని వాటితో పాటు  నెయ్యి, ఉప్పు వేసి బాగా మిక్స్‌ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత రాత్రి భోజనం చేసిన గంట తర్వాత ఇలా తయారు చేసిన డ్రింక్‌ను తాగడం వల్ల సులభంగా మలబద్ధకం, పొట్ట సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.

Also Read: Revanth Reddy: విశ్వనగరమో.. విషాద నగరమో తేలిపోయింది.. వర్షాలపై మంత్రి కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ  

పొట్ట సమస్యలను ప్రభావంతంగా తగ్గించేందుకు రాక్‌ సాల్ట్‌ కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఉబ్బరం నుంచి విముక్తి కలిగిస్తుంది. దీని కోసం ఒక గ్లాస్‌ గోరువెచ్చని నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. అందులో అర చెంచా రాక్ సాల్ట్‌ని కలుపుకుని, నీరు గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

వానా కాలంలో చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల డయేరియా లేదా లూజ్ మోషన్ సమస్యల బారిన పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే మరింత ప్రమాదకరంగా మారే ఛాన్స్‌ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు సోంపు, అల్లంతో తయారు చేసిన టీని తాగాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా లూజ్ మోషన్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. 

Also Read: Revanth Reddy: విశ్వనగరమో.. విషాద నగరమో తేలిపోయింది.. వర్షాలపై మంత్రి కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More