Home> హెల్త్
Advertisement

Cotton Candy: పిల్లలు 'పీచు మిఠాయి' తింటుంటే వెంటనే ఆపండి.. లేకుంటే ముప్పు తప్పదు

Cotton Candy Ban: రంగురంగుల్లో కనిపించే తియ్యటి పీచు మిఠాయి మీ పిల్లలు తింటుంటే ఇక ఆపేయండి. వెంటనే తినొద్దని చెప్పేయండి. ఆ పీచు మిఠాయిలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని తేలింది. ఇప్పటికే రెండు చోట్ల నిషేధం విధించగా.. ఏపీ కూడా నిషేధం విధించే అవకాశం ఉంది.

Cotton Candy: పిల్లలు 'పీచు మిఠాయి' తింటుంటే వెంటనే ఆపండి.. లేకుంటే ముప్పు తప్పదు

Cotton Candy Cancer Cause: పీచు మిఠాయి కనిపించగానే పిల్లలే కాదు పెద్దలు కూడా ఆగకుండా తినేస్తారు. మెత్తగా తియ్యగా ఉండే పీచు మిఠాయి అంటే అందరికీ ఇష్టమే. కానీ తింటేనే మన ఆరోగ్యానికి కష్టమని చెబుతున్నారు. అందుకే పీచు మిఠాయిని కొన్ని రాష్ట్రాలు నిషేధించాయి. ఏపీలో కూడా నిషేధం పడుతుందని తెలుస్తోంది. ఇంతలా నిషేధం విధించడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయని తెలిసింది. పీచు మిఠాయి తింటే చిన్నారుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు.

Also Read: Aadhaar Update: గుడ్‌న్యూస్‌.. ఆధార్‌ అప్డేట్‌ కోసం ప్రత్యేక కేంద్రాలు.. ఎక్కడ అంటే..? 

మనం తినే పీచు మిఠాయి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని .. వీటిని తినడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయ తమిళనాడు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో గతవారం తమిళనాడు, పుదుచ్చేరిలో పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధించారు. ఈ పీచు మిఠాయిలో ప్రమాదకరమైన రోడమైన్‌ బి అనే రసాయనం ఉందని అధికారులు గుర్తించారు. ఈ రసాయనం పిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని ప్రభుత్వానికి నివేదించారు. కృత్రిమ రంగుల కోసం వినియోగిస్తున్న ఆ రసాయనంతో కిడ్నీ, కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుందని అధికారులు నిర్ధారించారు.

Also Read: Dengue Fever: మంత్రికి సోకిన డెంగీ వ్యాధి.. మేడారం జాతర ఎలా జరుగునోనని ఆందోళన..

అధికారుల నివేదిక అనంతరం తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్రమణియన్‌  మీడియాకు వివరాలు వెల్లడించారు. 'చెన్నై నగరంలో నమూనాలు సేకరించి అధ్యయనం చేపట్టగా రోడమైన్‌ బీ అనే రసాయనం వాడుతున్నారని తేలింది. వస్త్రాల తయారీలో 'డై' కోసం ఈ రసాయనం వాడుతుంటారు. ఇప్పటి నుంచి పీచు మిఠాయిపై నిషేధం విధిస్తున్నాం. ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధంగా పీచు మిఠాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు' అని హెచ్చరించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలోనూ పీచు మిఠాయిపై నిషేధం కొనసాగుతోంది.

ఇక పీచు మిఠాయిపై ఆంధ్రప్రదేశ్‌లోనూ నిషేధం అవకాశం ఉంది. పొరుగున తమిళనాడు, పాండిచ్చేరి నిషేధం విధించడంతో ఏపీ కూడా ఆ దిశగా చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే పీచు మిఠాయిపై శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపాలని ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి శాంపిళ్లను సేకరిస్తోంది. సేకరించిన శాంపిళ్లను టెస్టింగ్ కోసం పంపనున్నారు. ల్యాబ్ టెస్టింగ్‌లో వచ్చే నివేదిక ఆధారంగా పీచు మిఠాయిపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More