Home> హెల్త్
Advertisement

Amla Juice Benefits: ప్రతిరోజు ఉసిరి రసం తాగితే చాలు.. జీవితంలో గుండెపోటు రాదు

Amla Juice Benefits for Heart Patients: ఉసిరి రసం ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ కింది వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Amla Juice Benefits: ప్రతిరోజు ఉసిరి రసం తాగితే చాలు.. జీవితంలో గుండెపోటు రాదు

Amla Juice Can Prevents Chronic Diseases & Heart Attacks: ఆధునిక జీవనశైలిని అనుసరించడం వల్ల చాలా మంది ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. వీటి నుంచి ఉపశమనం పొందడానికి వైద్యులను సంప్రదిస్తున్నారు. మరికొందరైతే మార్కెట్‌లో లభించే ఔషధలను వినియోగిస్తున్నారు. అయితే వీటికి బదులుగా ఆయుర్వేద నిపుణులు సూచించిన ఉసిరి జ్యూస్‌ను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా సహాయపడుతుంది. ప్రతి రోజు ఈ జ్యూస్‌ను తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయే ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఉసిరి తయారి విధానం:

ముందుగా తాజా ఉసిరి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని చిన్న ముక్కలుగా కట్‌ చేసి గ్రైడర్‌ వేసి జ్యూస్‌లా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న రసాన్ని ఒక చిన్న కప్పులో పోసుకుని సన్నని  మంటపై మరిగించుకోవాలి. ఆ తర్వాత అర్జున్ బెరడు పొడిని కలిపి గ్లాసు మరికొద్ది సేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత వడకట్టుకుని తేనెను కలిపి ప్రతి రోజు ఖాళీ కడుపుతో తాగాల్సి ఉంటుంది. 

ఉసిరి రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

ఉసిరికాయ ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్‌ తీవ్ర వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.

Also Read: Chia Seeds Side Effects: అతిగా చియా సీడ్స్‌ వినియోగిస్తున్నారా? అయితే ఇది గుర్తుంచుకోండి!

రోగనిరోధక శక్తిని పెరుగుతుంది:

ఉసిరి రసం ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి అధిక పరిమాణంలో లభించి, రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా తీవ్ర వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. 

గుండె సమస్యలకు చెక్‌:

ఉసిరి రసం, అర్జున బెరడులోని ఫైటోకెమికల్స్ రక్తపోటును నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు గుండెను ఆరోగ్యంగా చేసేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More