Home> హెల్త్
Advertisement

Amla Benefits: ఉసిరి అందరికీ మంచిది కాదా, ఎవరెవరు ఉసిరి కాయలు తినకూడదు

Amla Benefits: శరీరంలో అన్నింటికి మూలం జీర్ణక్రియ. జీర్ణక్రియ బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. మీరు కూడా మీ జీర్ణక్రియను మెరుగుపర్చుకోవాలంటే..డైట్‌లో ఉసిరికాయలు తప్పకుండా చేర్చాలి. ఉసిరితో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

Amla Benefits: ఉసిరి అందరికీ మంచిది కాదా, ఎవరెవరు ఉసిరి కాయలు తినకూడదు

ఉసిరి ఔషధపరంగా చాలా మంచిది. వివిధ రకాల వ్యాధుల్ని దూరం చేయవచ్చు. ఉసిరితో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు..చర్మ సంరక్షణలో కూడా కీలకంగా ఉపయోగపడుతుంది. అయితే కొంతమంది లేదా కొన్ని రకాల వ్యాధులున్నవాళ్లు ఉసిరి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు.

చలికాలంలో మార్కెట్‌లో ఉసిరి కాయలు సమృద్ధిగా లభిస్తాయి. చాలామంది ఇష్టంగా తింటారు కూడా. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపర్చేందుకు ఉసిరి కాయలు అద్భుతంగా ఉపయోగపడతాయి. చర్మ సంరక్షణలో కూడా ఉసిరి చాలా దోహదపడుతుంది. అయితే కొన్ని రకాల వ్యాధిగ్రస్థులు ఉసిరికాయలు అస్సలు తీసుకోకూడదు. ఉసిరి కాయలు ఎవరెవరు తినకూడదో తెలుసుకుందాం.

లో బ్లడ్ షుగర్

లో బ్లడ్ షుగర్ సమస్యతో బాధపడేవాళ్లు ఉసిరిని పూర్తిగా దూరం పెట్టాలి. ఎందుకంటే ఉసిరి తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ సమతుల్యత దెబ్బతింటుంది. లేనిపోని సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అందుకే లో షుగర్ ఉండేవాళ్లు ఉసిరి కాయలు తినకూడదు.

జలుబు, దగ్గు

జలుబు, దగ్గు సమస్యలున్నప్పుడు ఉసిరి తినకూడదు. ఎందుకంటే ఉసిరి స్వభావరీత్యా చలవ చేసేదిగా ఉంటుంది. కాబట్టి చలికాలంలో జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఉసిరి తింటే సమస్య మరింత ఎక్కువౌతుంటుంది. 

కడుపులో స్వెల్లింగ్

కొంతమందికి అకారణంగా కడుపులో స్వెల్లింగ్ సమస్య ఉంటుంది. ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఉసిరి తినకూడదు. ఎందుకంటే ఈ సమస్య ఉన్నప్పుడు ఉసిరి తింటే అది కాస్తా ఎక్కువౌతుంది. 

కిడ్నీ సమస్య

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఉసిరిని పూర్తిగా దూరం పెట్టాలి. ఎందుకంటే ఉసిరి తినడం వల్ల శరీరంలో సోడియం పరిమాణం పెరిగిపోతుంది. సోడియం పరిమాణం పెరగడం వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమౌతాయి. అందుకే కిడ్నీ సమస్య ఉన్నప్పుడు ఉసిరికి దూరంగా ఉండాలి.

Also read: Natural Blood Thinners: ఈ మూడు వాడితే చాలు..రక్తం పల్చబడేందుకు ఇంగ్లీషు మందుల అవసరం లేదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More