Home> హెల్త్
Advertisement

Dry Cough: పొడి దగ్గు తగ్గట్లేదా...! ఈ చిట్కాలు మీ కోసం...

Dry Cough: సాధారణంగా మ‌న‌లో కొంద‌రికి ఏ కాలంలో అయినా స‌రే పొడి ద‌గ్గు వ‌స్తుంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చాలా మంది ఈ పొడిదగ్గుతో ఇబ్బంది పడుతుంటారు. ఇది ఎక్కువగా వాతావరణ మార్పుల వలన, శీతలపానీయాలను ఎక్కువగా తాగడం వలన వస్తుంది.  ఈ పొడి దగ్గుకు చెక్ పెట్టాలంటే..ఈ  చిట్కాలు పాటించండి.

Dry Cough: పొడి దగ్గు తగ్గట్లేదా...! ఈ చిట్కాలు మీ కోసం...

Home Remedies for Dry Cough: వర్షాకాలంలో మనల్ని ఎక్కువగా సీజనల్ వ్యాధులు వేధిస్తాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరాలు చుట్టుముడతాయి. అయితే ఇప్పుడు ఓ వైపు కరోనా మరోవైపు సీజనల్ వ్యాధులు(Seasonal Deases) ..  దీంతో చిన్న పాటి దగ్గు వచ్చినా భయపడే పరిస్థితులు ఉన్నాయి. చల్లటి వాతావరణం కొంతమందికి ఆరోగ్య సమస్యలు తీసుకొస్తుంది. ముఖ్యంగా దగ్గు(Cough) మరీ ఇబ్బంది పెడుతుంది. అయితే ఇలా దగ్గురావడానికి ఒక్క వాతావరణం మాత్రమే కారణం కాదు.. గొంతు వెనకాల మ్యూకస్, ఏవో తెలియని చికాకు పెట్టే జీవులు జారుకున్నప్పుడు దగ్గు అసంకల్ప ప్రతీకార చర్యగా వస్తుంది. 

Also Read: Green Tea: గ్రీన్ టీ ఎప్పుడు, ఎలా పుట్టింది, గ్రీన్ టీ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు

కొంతమంచి పొడి దగ్గు(Dry cough)తో తీవ్రంగా ఇబ్బంది పడతారు. కొన్ని సార్లు ఎన్ని మందులు వాడినా ఈ పొడి దగ్గు తగ్గదు. అయితే అలాంటి సమయంలో వంటింటి చిట్కాలు మంచి ఔషధంగా పని చేస్తాయి. ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం..

*తులసి ఆకులను వేడి నీటిలో వేసి బాగా మరిగించి ఆ కషాయాన్ని తాగడం ద్వారా దగ్గును తగ్గించుకోవచ్చు.
*పసుపు పాలు గోరు వెచ్చగా రోజు రెండు సార్లు తాగితే దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది.
*దగ్గు తీవ్రంగా ఉంటే తిప్ప తీగ మంచి ఔషధం. 2 చెంచాల తిప్పతీగ రసాన్ని నీటిలో కలిపి దగ్గు తగ్గేవరకూ ప్రతిరోజూ ఉదయాన్నే తాగితే ఎంత తీవ్రమైన దగ్గు అయినా తగ్గుతుంది.
* దగ్గు కోసం మరొక ఎఫెక్టివ్ ఆయుర్వేద చిట్కా తేనె , యష్టిమధురం ,దాల్చినచెక్క.. వీటి పొడిని సమపాళ్లలో తీసుని నీటిలో కలుపుకుని రోజుకి రెండు సార్లు పొద్దున, సాయంత్రం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
*ఆగకుండా దగ్గు వేధిస్తుంటే.. మిరియాల కషాయం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అర స్పూన్ నల్ల మిరియాల పొడిలో దేశీయ ఆవు నెయ్యితో కలుపుని ఈ మిశ్రమాన్ని ఏదైనా తిన్న తర్వాత తీసుకోవాలి.
*పిల్లలు దగ్గుతో ఇబ్బంది పడుతుంటే దానిమ్మ రసంలో చిటికెడు అల్లం పొడిని కలిపి ఇస్తే మంచి ఫలితం ఉపశమనం ఇస్తుంది.
* వేడి వేడి మసాలా టీ, దగ్గుని సహజంగా తగ్గిస్తుంది. అర చెంచా అల్లం పొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడి, కొన్ని లవంగాలు టీకి జత చేసి వేడిగా టీ తాగితే దగ్గు తగ్గుతుంది.

సర్వసాధారణంగా దగ్గు రాత్రి సమయంలో అధికంగా వస్తుంది. కనుక దగ్గు నుంచి ఉపశమనం పొందాలంటే తలని కొంచెం ఎత్తులో ఉండేలా చూసుకుని నిద్రపోతే దగ్గు తగ్గి.. హాయిగా నిద్రపడుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More