Home> హెల్త్
Advertisement

అరటి పండు ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి

Health Tips  | కరోనా లాంటి మహమ్మారి ప్రకంపనలు రేపుతున్న నేపథ్యంలో మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇందుకోసం రోగ నిరోధక శక్తిని పెంపొందించే అరటి పండ్లు (Banana) తినాలి. అరటిలో ఎన్నో అద్భుత ఔషధ గుణాలున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.

అరటి పండు ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి

Banana Benefits | ప్రపంచంలో పలు దేశాలలో అరటిని పండిస్తారు. ముఖ్యంగా ఆసియా, అత్యుష్ణ ప్రదేశాలతో పాటు కొన్ని యూరప్ దేశాల ప్రజలు సైతం అరటి పండు (Banana)ను తింటారు. అరటి పండు వల్ల కలిగే ప్రయోజనాలు, అరటి చేసే మేలు తెలిస్తే ఈ పండు తినేందుకు అనాసక్తి చూపించని వారే ఉండరు. మీరెప్పుడైనా గమనించారా క్రీడాకారులు, లేక అధికంగా శ్రమించేవారు కచ్చితంగా అరటిపండును తింటారు. ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి

క్రికెటర్లు, ఫుట్‌బాల్ ప్లేయర్లు ప్రాక్టీస్ సెషన్ సమయంలో అరటి పండ్లు తింటూ కనిపిస్తారు. అరటిలో బరువును తగ్గించడంతో పాటు మలబద్ధకాన్ని నివారించే అద్భుత ఔషద గుణలున్నాయని కొందరికే తెలుసు. రక్తహీనత, మూత్రపిండాల సమస్య, బీపీ, గుండె సంబంధిత సమస్యలకు ప్రతిరోజూ అరటి తినడంతో చెక్ పెట్టవచ్చుని వైద్యశాస్త్రం చెబుతోంది. అరటి పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలెంటో తెలుసుకుందామా..  తొడలు లావుగా ఉన్నాయా.. అయితే మీకు శుభవార్త

అరటి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే.. (Health Benefits Of Banana)

  • కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి సమయాల్లో తినాల్సిన పండ్లలో అరటి ఒకటి. ఇందులో విటమన్ సి (Vitamin C) పుష్కలంగా ఉంటుంది. రోగ నిరోధశక్తి (Strengthen Immunity)ని పెంపొందించి త్వరగా అనారోగ్యం బారిన పడనీయకుండా చేస్తుంది.
  • అరటి పండు ఎముకలకు గట్టిదనాన్నిస్తుంది. అరటిలో అతి తక్కువ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఈ కొవ్వు కాల్షియం లాంటి పదార్థాలను గ్రహించే సామర్థాన్ని అందిస్తుంది. తద్వారా ఎముకలు గట్టిపడేందుకు అరటి పాత్ర కీలకం. 
  • ఇందులో ఉండే ఖనిజ లవణాలు, పోషకాలు జీర్ణక్రియను సాఫీగా ఉండేలా చేస్తాయి. బోలు ఎముకల వ్యాధి బారిన పడకుండా చేస్తుంది. ప్రతిరోజూ ఒక అరటి పండు వీక్‌నెస్ (బలహీనత) లాంటివి కనిపించకుండా మనల్ని ఉత్తేజితం చేస్తుంది.
  • అరటి పండు ఫైల్స్ తగ్గడంలో సహాయపడుతుంది: పైల్స్ సమస్య ఉన్నవారికి సాంత్వన చేకూరుస్తుంది. పైల్స్ బాధితులు అరటి పండు తినడం వల్ల మల విసర్జన సాఫీగా అయ్యి రక్తస్రావం వంటి సమస్యలను దూరం చేస్తుంది. పైల్స్ వల్ల కలిగే నొప్పి, దురద సమస్యలు తగ్గించడంలో కొంతమేర ప్రభావం చూపుతుంది.  సులువుగా రోగ నిరోధకశక్తిని పెంచే చిట్కాలు
  • ప్రతిరోజూ అరటి తింటే రక్తహీనత సమస్యను పరిష్కరిస్తుంది. ఎర్రరక్తకణాలో ఇనుము (Iron) శాతాన్ని పెంచి రక్తహీనత బారిన పడకుండా కాపాడుతుంది. ఎర్రరక్తకణాలు పెరగడంతో పాటు ఐరన్‌ను పెంపొందించి శరీరానికి రక్త ప్రసరణ సజావుగా జరుపుతుంది.
  • సహజంగా బరువు కోల్పోవాలనుకునే వారు అరటి పండు తినేందుకు ఆసక్తి చూపిస్తారు. ఆకలిని నియంత్రించి వేళకు మితంగా భోజనం తీసుకునేలా అరటి మనల్ని ప్రేరేపిస్తుంది. తక్షణమే శక్తిని ఇచ్చే పండ్లలో అరటి ఒకటి.
  • అరటి పండ్ల ద్వారా లభించే పొటాషియం మిమ్మల్ని గుండె సంబంధిత సమస్యలకు దూరం చేస్తుంది. సోడియం తక్కువ మోతాదులో లభిస్తుంది. అధిక పొటాషియం - తక్కువ సోడియం ఫలితంగా అధిక రక్త పీడనం (High Blood Pressure) సమస్యకు చెక్ పెడుతుంది.
  • సాధారణ సైజు అరటి పండు తింటే రోజులో కావలసిన 13శాతం మాంగనీసును శరీరానికి అందించి మీ శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్

Read More