Home> హెల్త్
Advertisement

Fact Check: CoviShield 73 రోజుల్లో అందుబాటులోకి రానుందా ? నిజం ఏంటి ?

కోవిడ్-19 (Covid-19) వ్యాక్సిన్ కోసం భారతీయులు 2021 వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. 

Fact Check: CoviShield 73 రోజుల్లో అందుబాటులోకి రానుందా ? నిజం ఏంటి ?

కోవిడ్-19 ( Covid-19 ) వ్యాక్సిన్ కోసం భారతీయులు 2021 వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇన్ స్టిట్యూట్ ( Serum Institute ) ముందే చెప్పింది. అయితే అది ఎన్ని రోజుల్లో వస్తుందో అది మాత్రం ఖచ్చితంగా చెప్పలేదు.

కానీ కొన్ని మీడియా సంస్థల్లో ఆదివారం ఉదయం నుంచి ఒక వార్త బాగా చెలమణి అవుతోంది. ఆక్స్ ఫర్డ్ ( OxFord ) శాస్త్రవేత్తలు తయారు చేస్తోన్న కోవిషీల్డ్ ( CoviShield ) వ్యాక్సిన్ భారత మార్కెట్ లో కేవలం 73 రోజుల్లోనే అందుబాటులోకి రానుంది అనేది దీని సారాంశం. దీనిపై సీరం ఇన్ స్టిట్యూట్ సిఈఓ అదార్ పూనావాలా స్పందించారు. దాని గురించి ఆయన క్లారిటీ ఇస్తూ ఆదివారం మధ్యాహ్నం ట్వీట్ చేశారు.

సీరం ఇన్ స్టిట్యూట్ సిఈఓ అదార్ పూనావాలా ( Adar Poonawalla ) కోవిషీల్డ్ వ్యాక్సిన్ భారత మార్కెట్ లో 73 రోజుల్లో వస్తుంది అనే వార్తలో నిజం లేదు అని తెలిపారు. ప్రస్తుతం 3వ దశ ట్రయల్ లో ఉంది అని..ఈ ట్రయల్ పూర్తి అయన తరువాత మాత్రమే చెబుతాం అన్నారు.

ఇటీవలే ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదార్ పూనావాలా ఈ సంవత్సరం ముగిసేలోపు మొత్తం 400 మిలియన్ల కోవిషీల్డ్ వ్యాక్సిన్ లను తయారు చేస్తాం అన్నారు. ఇందులో 50 శాతం భారతదేశం కోసం కేటాయిస్తాం అన్నారు. దాంతో పాటు మొత్తం 92 దేశాలకు వ్యాక్సిన్ సప్లై చేస్తాం అన్నారు.

ఇవి కూడా చదవండి

Read More