Home> హెల్త్
Advertisement

Acid Attacks: యాసిడ్ దాడి జరిగినప్పుడు తక్షణం ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలో తెలుసా

Acid Attacks: ఒంటిపై యాసిడ్ పడితే తక్షణం ఏం చేయాలనేది చాలామందికి తెలియదు. ఆసుపత్రి దూరంగా ఉంటే ముందు ఫస్ట్ ఎయిడ్ అవసరమౌతుంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలనేది తెలుసుకుందాం..

Acid Attacks: యాసిడ్ దాడి జరిగినప్పుడు తక్షణం ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలో తెలుసా

ఇటీవలికాలంలో యాసిడ్ దాడులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకానగర్ ప్రాంతంలో ఓ విద్యార్ధినిపై యాసిడ్ దాడి ఘటన కలకలం రేపింది. అసలు యాసిడ్ దాడి జరిగినప్పుడు వెంటనే ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ చేయాలి. ఆ వివరాలు మీ కోసం..

యాసిడ్ దాడి జరిగితే తక్షణం చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్

ఎవరైనా యాసిడ్ దాడికి గురైతే తక్షణం ఏం చేయాల్సి ఉంటుంది. ఆసుపత్రి దూరంగా ఉంటే ఫస్ట్ ఎయిడ్ తప్పకుండా చేసి ఆసుపత్రికి తీసుకెళ్లాలి. లేకపోతే యాసిడ్ అనేది చర్మం టిష్యూల్ని లోపలివరకూ హాని కల్గిస్తుంది. దీన్ని నియంత్రించేందుకు ముందుగా కొన్ని పద్ధతులు పాటించాలి. యాసిడ్ అంటే H2SO4.ఎవరినైనా చాలా దారుణంగా మాడ్చేస్తుంది. యాసిడ్ దాడి జరిగితే రంగు రూపం భయంకరంగా మారిపోతాయి. అందుకే యాసిడ్ దాడి జరిగినప్పుడు ముందుగా బాధితుడు లేదా బాధితురాలిని నీటి ప్రవాహంలో కూర్చోబెట్టేయాలి. అంటే ఎక్కడెక్కడ యాసిడ్ పడిందో..ఆయా భాగాల్లో నీళ్లు నిరాటంకంగా పోస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల యాసిడ్..చర్మం అంతర్గత టిష్యూలు దెబ్బతినకుండా ఉంటాయి.

ఆరోగ్య నిపుణుల ప్రకారం యాసిడ్ అనేది కేవలం శరీరం పైభాగానికే కాకుండా లోపలున్న టిష్యూలను కూడా పాడుచేస్తుంది. ఒకవేళ బాధితురాలిని దీన్నించి కాపాడుకోవాలంటే..దాడి జరిగిన వెంటనే నీటి ప్రవాహం కింద కూర్చోబెట్టేయాలి. దాదాపు గంటవరకూ యాసిడ్ పడిన భాగంపై నీళ్లు పోస్తూనే ఉండాలి. 

ఒకవేళ అందుబాటులో నీళ్లు లేకపోతే..పాలు కూడా ఉపయోగించవచ్చు. యాసిడ్ దాడి జరిగిన శరీర భాగాలపై అదే పనిగా పాలు పోస్తుండాలి. ఈ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చిన తరువాత లేదా ఫస్ట్ ఎయిడ్ ఇస్తూ ఆసుపత్రికి తీసుకెళితే చాలా మంచిది. 

Also read: High Cholesterol: బాడీలో ఆ నొప్పులుంటే తేలిగ్గా తీసుకోవద్దు, హై కొలెస్ట్రాల్ సంకేతమే అది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More