Home> హెల్త్
Advertisement

Reduce High Cholesterol: 9 రోజులు ఈ 4 రసాలు తాగితే కొలెస్ట్రాల్‌ వెన్నలా కరగడం ఖాయం..

4 Drinks For Reduce High Cholesterol In 9 Days: చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ కింది ఐదు డ్రింక్స్‌ను తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్య నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.

 Reduce High Cholesterol: 9 రోజులు ఈ 4 రసాలు తాగితే కొలెస్ట్రాల్‌ వెన్నలా కరగడం ఖాయం..

4 Drinks For Reduce High Cholesterol In 9 Days: కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. శరీరంలోని కొలెస్ట్రాల్ శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కణాలను తయారు చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ కొలెస్ట్రాల్ శరీరంలో తీవ్రంగా పెరిగితే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారాలు తినేవారిలో వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. 

అధిక కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి:
రక్తంలోని కొలెస్ట్రాల్‌ పేరుకుపోవడం వల్ల తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా కొందరిలో గుండెలోని సిరల్లో కొవ్వు పేరుకుపోయి..ధమనిలో రక్త ప్రసరణలో మార్పులు వస్తాయి. దీని కారణంగా గుండెపోటు, పక్షవాతం వంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా రావచ్చు. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఈ కింది డ్రింక్స్‌ ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు ఈ డ్రింక్స్‌ తాగండి:
టమోటా రసం:

టమోటా రసం తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో లైకోపీన్ అనే పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి.  శరీరంలోని లిపిడ్ స్థాయిలను మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ప్రతి రోజు ఈ రసం తాగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఫైబర్‌ శరీర బరువును తగ్గిస్తుంది. 

Also read: Godavari Floods: ఉగ్రరూపంతో గోదావరి, ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ

బెర్రీల స్మూతీ:
బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీనితో తయారు చేసిన రసాన్ని తాగితే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అంతేకాకుండా ఊబకాయం సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు బెర్రీలతో తయారు చేసిన రసం తాగాల్సి ఉంటుంది. 

ఓట్స్ డ్రింక్:
ఓట్స్‌తో తయారు చేసిన ఆహారాలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును కూడా తగ్గిస్తుంది. అయితే ఈ ఓట్స్‌తో తయారు చేసిన రసాన్ని ప్రతి రోజు తాగడం వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. 

గ్రీన్ టీ:
గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు రెండు కప్పుల చొప్పును తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. అంతేకాకుండా గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. 

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also read: Godavari Floods: ఉగ్రరూపంతో గోదావరి, ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More