Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

YSR biopic trailer : వైఎస్సార్‌ పేదలకు ఎందుకంత చేరువయ్యారో చెప్పే యాత్ర మూవీ ట్రైలర్

వైఎస్సార్‌ బయోపిక్ యాత్ర మూవీ ట్రైలర్

YSR biopic trailer : వైఎస్సార్‌ పేదలకు ఎందుకంత చేరువయ్యారో చెప్పే యాత్ర మూవీ ట్రైలర్

దివంగత ముఖ్యమంత్రి, అశేష ప్రజాధరణ కగిలిన ప్రజా నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ యాత్ర మూవీ ఫిబ్రవరి 8వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా ఆ చిత్ర నిర్మాతలు యాత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూసిన అనంతరం.. మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కేరళ స్టార్ హీరో మమ్ముట్టి వైఎస్సార్ పాత్ర పోషించారని అనడం కంటే... మమ్ముట్టి మరోసారి వైఎస్సార్‌ని కళ్లముందు కదలాడేలా చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో వైఎస్సార్ అవలంభించిన విధానాలే ఆయనను నిరుపేదలకు అంత చేరువ చేసిందని చెప్పేలా ఈ సినిమాను తెరకెక్కించారని యాత్ర బయోపిక్ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, సుహాసిని మణిరత్నం, రావు రమేష్, అనసూయ, పోసాని కృష్ణమురళి, వినోద్ కుమార్, సచిన్ ఖేద్‌కర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

Read More