Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

Vakeel Saab teaser: వకీల్ సాబ్ టీజర్‌కి ముహూర్తం ఖాయం ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ ( Pawan Kalyan birthday celebrations ) ఇంకెంతో దూరంలో లేవు. సెప్టెంబర్ 2న పవన్ కల్యాన్ బర్త్ డే సందర్భంగా పవన్ కల్యాణ్ అభిమానులకు వకీల్ సాబ్ నిర్మాతలు ఓ కానుక ఇవ్వనున్నట్టు ఫిలింనగర్ టాక్.

Vakeel Saab teaser: వకీల్ సాబ్ టీజర్‌కి ముహూర్తం ఖాయం ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ ( Pawan Kalyan birthday celebrations ) ఇంకెంతో దూరంలో లేవు. సెప్టెంబర్ 2న పవన్ కల్యాన్ బర్త్ డే సందర్భంగా పవన్ కల్యాణ్ అభిమానులకు వకీల్ సాబ్ నిర్మాతలు ఓ కానుక ఇవ్వనున్నట్టు ఫిలింనగర్ టాక్. అదేమంటే.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజున వకీల్ సాబ్ టీజర్‌ను ( Vakeel saab teaser ) విడుదల చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఐతే వాస్తవానికి వకీల్ సాబ్ టీజర్ విడుదలపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే, పవన్ కళ్యాణ్ 50వ పుట్టినరోజు వేడుకలు అభిమానులకు మరింత స్పెషల్ కానున్నాయి. Also read : Rana Daggubati: రానాకు బాగా ఇష్టమైన వంటకం ఏంటో తెలుసా ?

హిందీలో పింక్ పేరిట విడుదలైన ఈ సినిమా తెలుగులో వకీల్ సాబ్ పేరిట రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ న్యాయవాది పాత్రలో నటించనున్నాడు. మార్చి నెలలోనే వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ విడుదల కాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోంచి మగువా మగువా అనే ఫస్ట్ సింగిల్ ( Maguva maguva song ) విడుదలైంది. వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కి, మగువా మగువా పాటకు భారీ స్పందన కనిపించింది. దీంతో ఇక పవన్ కల్యాణ్ అభిమానుల దృష్టి అంతా వకీల్ సాబ్ మూవీ టీజర్‌పైనే ఉంది. Also read : V movie: వి మూవీ OTT రైట్స్ ఎంతో తెలుసా ?

వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నివేదా థామస్ ( Actress Nivetha Thomas ), అంజలి ( Actress Anjali ) ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తుండగా దిల్ రాజు, బోనీ కపూర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Also read : Kalyani Priyadarshan: సూపర్ స్టార్ కుమారుడితో డైరెక్టర్ కూతురు డేటింగ్

Also read :  Singers Sunitha, Malavika: సింగర్స్ సునీత, మాళవికకు కరోనా పాజిటివ్

Read More