Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

హీరో ఉదయ్ కిరణ్ బయోపిక్ పై తేజ కామెంట్

నువ్వునేను, చిత్రం, శ్రీరామ్, మనసంతా నువ్వే లాంటి హిట్ సినిమాలలో నటించి ఒకప్పుడు యూత్ ఫాలోయింగ్ బాగా పెంచుకున్న నటుడు ఉదయ్ కిరణ్. 

హీరో ఉదయ్ కిరణ్ బయోపిక్ పై తేజ కామెంట్

నువ్వునేను, చిత్రం, శ్రీరామ్, మనసంతా నువ్వే లాంటి హిట్ సినిమాలలో నటించి ఒకప్పుడు యూత్ ఫాలోయింగ్ బాగా పెంచుకున్న నటుడు ఉదయ్ కిరణ్. అయితే పలు కారణాల వల్ల ఈ యువనటుడికి అవకాశాలు సన్నగిల్లడం.. ఆ తర్వాత వివాహమయ్యాక తాను ఆత్మహత్య చేసుకోవడం లాంటి అంశాలు సినీ పరిశ్రమలో ఎందరినో దిగ్భ్రాంతికి గురిచేశాయి.

ఇప్పుడు తాజాగా దర్శకుడు తేజ, ఉదయ్ కిరణ్ బయోపిక్ తెరకెక్కిస్తారని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈ వార్తలలో ఎలాంటి నిజమూ లేదని చెప్పేశారు దర్శకుడు తేజ. ఇలాంటి వదంతులను నమ్మవద్దని ఆయన ప్రేక్షకులకు తెలిపారు. అయితే తేజ తాను ఓ పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాను ఒకటి ప్లాన్ చేసినట్లు మాత్రం తెలిపారు. ఆ చిత్రంలో హీరో రానా నటిస్తున్నారని ఇండస్ట్రీ సమాచారం. ఇప్పటికే తేజ దర్శకత్వంలో రానా "నేనే రాజు నేనే మంత్రి" లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

ఇటీవలే దర్శకుడు తేజ "ఎన్టీఆర్" బయోపిక్ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆ తర్వాత ఆ ఆలోచనకు స్వస్తి పలికారు. అలాగే హీరో వెంకటేష్‌తో కూడా తేజ ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఆ చిత్రంలో ఆయనకు జోడిగా శ్రియ నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో వెంకటేష్ ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్నారట. 

Read More