Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

తిరుపతితో శ్రీదేవి జ్ఞాపకాలు ఎన్నో ..!

ప్రేక్షకలోకాన్ని కట్టిపడేసిన అందాల తారా శ్రీదేవి ఆకస్మికంగా దివికేగింది. ఈ నేపథ్యంలో ఆమెకు తిరుపతి నగరంతో ఉన్న అనుబంధం గురించి ఒక్కసారి తెలుుకుందాం..

తిరుపతితో శ్రీదేవి జ్ఞాపకాలు ఎన్నో ..!

ప్రేక్షకలోకాన్ని కట్టిపడేసిన అందాల తారా శ్రీదేవి ఆకస్మికంగా దివికేగింది. ఈ నేపథ్యంలో ఆమెకు తిరుపతి నగరంతో ఉన్న అనుబంధం గురించి ఒక్కసారి తెలుుకుందాం..
ఓ ప్రముఖ మీడియా కథనం ప్రకారం అలనాటి నటి శ్రీదేవికి తిరుపతితో విడదీయరాని బంధం ఉంది.శ్రీదేవి తల్లిదండ్రులు కొంతకాలం పాటు తిరుపతిలో నివసించారు. శ్రీదేవి పుట్టక ముందు ఆమె తల్లిదండ్రులు స్థానిక ఆకుతోట వీధిలో ఉండేవారు. కొంత కాలం తర్వాత వారు చెన్నైకు మారినా.. తరచూ తిరుపతికి వచ్చి వెళ్లేవారు. కాగా శ్రీదేవి తల్లి రాజేశ్వరికి స్వయానా చెల్లెలు అనసూయమ్మ ఇప్పటికీ తిరుపతిలోనే ఉంటున్నారు. అనసూయమ్మతో బాటు వారి దగ్గర బంధువు వరుసకు శ్రీదేవి తల్లికి పిన్నికూతురు మునిసుబ్బమ్మ సైతం కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలోని ఆకుతోటవీధిలోనే ఉంటున్నారు.

చిన్నతనం నుంచి చిన్నమ్మలు, కుటుంబ సభ్యులకు ఎంతగానో ఇష్టపడే శ్రీదేవి ఆమె ముంబై నుంచి తిరపతి వచ్చిన ప్రతిసారీ వీరిని కలిసి యోగక్షేమాలు కనుక్కుని వారితో గడిపి వెళ్లేవారట. తిరుమల శ్రీవారి దర్శనార్థం ఏటా శ్రీదేవి తన కుటుంబంతో వస్తారు. 

ఆలనా పాలనా చూసిన చిన్నమ్మ

తల్లి మరణానంతరం శ్రీదేవి తల్లి ఆలనా పాలనా ఆమె చిన్నమ్మ అనసూయమ్మ చూసేవారు. తన సొంతబిడ్డ కంటే ఎక్కువగా చూసుకునేవారు. కాగా ఆదివారం ఉదయం శ్రీదేవి మరణవార్తను విన్న అనసూయమ్మ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా శ్రీదేవీ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బోరుల విలపిస్తున్నారు.

Read More