Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

Shocking Video: ఫ్లైట్ విండో, సీట్లు పగలగొడుతూ ప్రయాణీకుడి న్యూసెన్స్, వైరల్ అవుతున్న వీడియో

Shocking Video: ఆన్‌బోర్డ్ ఫ్లైట్‌లో ఓ ప్రయాణీకుడు చేసిన న్యూసెన్స్ వైరల్ అవుతోంది. నడుస్తున్న విమానం విండో బ్రేక్ చేసేందుకు ఓ ప్రయాణీకుడు చేసిన ప్రయత్నం సంచలనంగా మారింది. 

Shocking Video: ఫ్లైట్ విండో, సీట్లు పగలగొడుతూ ప్రయాణీకుడి న్యూసెన్స్, వైరల్ అవుతున్న వీడియో

Shocking Video: ఆన్‌బోర్డ్ ఫ్లైట్‌లో ఓ ప్రయాణీకుడు చేసిన న్యూసెన్స్ వైరల్ అవుతోంది. నడుస్తున్న విమానం విండో బ్రేక్ చేసేందుకు ఓ ప్రయాణీకుడు చేసిన ప్రయత్నం సంచలనంగా మారింది. 

పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ పెషావర్-దుబాయ్ పీకే 283 ఫ్లైట్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఇందులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణీకుడు హఠాత్తుగా లేచి సీటు, విండోను బ్రేక్ చేసేందుకు ప్రయత్నిస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తాడు. ఫ్లైట్‌లో న్యూసెన్స్ క్రియేట్ చేసిన తరువాత..విండో, సీట్లు డ్యామేజ్ చేసి..కింద ఫ్లోర్‌పై బోర్లా పడుకుండిపోయాడు.

ఫ్లైట్ ఎక్కినప్పుడు బాగానే ఉన్నాడని..హఠాత్తుగా ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేశాడని పాసెంజర్లు చెప్పడం వీడియోలో గమనించవచ్చు. నమాజ్ చేయకుండా ఆపినందుకు ఇలా చేశాడని మరి కొందరు చెబుతున్నారు. అతడు ఇలా వయొలెంట్‌గా ప్రవర్తిస్తుంటే నియంత్రించేందుకు ప్రయత్నించిన విమాన సిబ్బందిపై కూడా దాడి చేసినట్టు సమాచారం. చేసేది లేక చివరికి ఆ పాసెంజర్‌ను అతడి సీట్‌కు కట్టేశారు.

ప్రోటోకాల్ ప్రకారం ఫ్రైట్ కెప్టెన్..దుబాయ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సంప్రదించారు. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ ల్యాండ్ అవగానే..అతడిని అక్కడి సెక్యూరిటీ అధికారులు కస్టడీలో తీసుకున్నారు.ఈ ఘటన సెప్టెంబర్ 14న జరిగింది. ఇటీవల ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.

Also read: King Cobra Snake: పామును ముద్దు పెట్టుకున్న అమ్మాయికి ఏం జరిగిందో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More