Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

సవ్యసాచి మూవీ రివ్యూ

సవ్యసాచి మూవీ రివ్యూ

సవ్యసాచి మూవీ రివ్యూ

నటీనటులు : నాగ చైతన్య, నిధి అగర్వాల్, ఆర్ మాధవన్, భూమిక, షకలక శంకర్, సత్య తదితరులు.
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
నిర్మాణం : మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు : నవీన్ యెర్నేని, Y. రవి శంకర్, మోహన్ చెరుకూరి
కథ- స్క్రీన్ ప్లే -దర్శకత్వం : చందు మొండేటి
విడుదల : 2 నవంబర్ 2018
నిడివి : 150 నిమిషాలు.

ఇటీవలే 'శైలజా రెడ్డి అల్లుడు'గా వచ్చిన యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ‘సవ్యసాచి’గా ఈరోజే థియేటర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో చైతూ హిట్టు కొట్టాడా ? చందూ మొండేటి, చైతు కాంబో ఈసారి ఆడియన్స్‌ను ఎలా ఎంటర్టైన్ చేసింది ? జీ సినిమాలు ఎక్స్‌క్లూజీవ్ రివ్యూ.

కథ :
విక్రమ్, ఆదిత్య (నాగ చైతన్య) వానిష్‌ ట్విన్‌ సిండ్రమ్‌ వల్ల రక్తం పంచుకొని ఒకే శరీరంతో పుట్టిన కవలలు.. కాకపోతే ఆదిత్య, విక్రం శరీరంలో ఎడమ వైపు ఉంటాడు. అంటే బ్రెయిన్ నుండి ఎడమ చేతి వరకూ విక్రం శరీరంలో ఆదిత్య ఇమిడి ఉంటాడు. కొన్ని సందర్భాల్లో విక్రంకి తెలియకుండా ఎడమ చేతి ద్వారా రెస్పాండ్ అవుతుంటాడు ఆదిత్య. అది విక్రంకి కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. పెరిగి పెద్దయ్యాక ఒక యాడ్ ఫిలిం డైరెక్టర్‌గా మారతాడు విక్రం. ఈ క్రమంలో విక్రంకి కాలేజి రోజుల్లో తను ప్రేమించిన ప్రియురాలు చిత్ర (నిధి అగర్వాల్) ఆరేళ్ళ తర్వాత కనిపిస్తుంది. ఇక చిన్నతనంలో తల్లిని కోల్పోయిన విక్రం తన అక్క (భూమిక) కూతురు మహాలక్ష్మిలో తన తల్లిని చూసుకుంటూ బతికేస్తుంటాడు. అలా సాఫీగా సాగిపోతున్న విక్రం జీవితంలోకి భయంకరమైన తుఫాన్‌లా వస్తాడు అరుణ్ (మాధవన్).

విక్రం కుటుంబాన్ని హతమార్చాలనుకుంటాడు అరుణ్. అరుణ్ ఎటాక్ నుండి విక్రం అక్క ప్రాణాలతో బయటపడుతుంది. అదే సమయంలో విక్రం ప్రాణంలా భావించే పాప మహా చనిపోలేదని తెలుస్తుంది. మహాని కిడ్నాప్ చేసి విక్రంతో మైండ్ గేమ్ ప్లే చేస్తాడు అరుణ్. ఇంతకీ అరుణ్ ఎవరు ? విక్రం, అరుణ్‌కి మధ్య ఏం జరిగింది ? రెండు చేతులతో అర్జునుడిలా పోరాడే సమర్థుడు విక్రం చివరికి అరుణ్‌ని ఎలా అంతమొందించాడు అనేదే ఈ సవ్యసాచి కథ.

నటీనటుల పనితీరు :
సినిమా సినిమాకు నటుడిగా పరిణితి చెందుతూ వస్తున్న నాగచైతన్య మరోసారి యాక్టింగ్‌లో మెప్పించాడు… కొన్ని సందర్భాలలో చైతు తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. గతంతో పోలిస్తే డాన్సులతో కూడా అలరించాడు. తనకి తెలియకుండా తన ఎడమ చేయి రెస్పాండ్ అయ్యే సీన్స్‌లో మంచి నటన కనబరిచాడు. ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ తెలుగులో నటించిన ఆర్ మాధవన్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. సైకో విలనిజంతో సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలిచాడు. నిధి గ్లామర్ షోకి, పాటలకే పరిమితం అయ్యింది. తన క్యారెక్టర్‌కి పెద్దగా స్కోప్ లేకపోవడంతో జస్ట్ పరవాలేదనిపించుకుంది.

సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి క్యారెక్టర్స్ కథలో ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్న భూమిక మరోసారి అలాంటి క్యారెక్టర్‌లోనే కనిపించింది. స్క్రీన్ మీద కనిపించింది కాసేపే అయినప్పటికీ తన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్ డైలాగ్ కామెడీతో అలరించాడు. సత్య, సుదర్శన్ తమ కామెడి టైమింగ్‌తో కొన్ని సందర్భాల్లో నవ్వించారు. మిగతా నటీనటులు తమ క్యారెక్టర్స్‌తో పరవాలేదనిపించుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు :
సినిమాకు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో అద్భుతంగా ఎలివేట్ చేసారు కీరవాణి.. ఇక ‘వై నాట్ ‘,’1980,81,82 ‘ సాంగ్స్ పరవాలేదనిపించగా సవ్యసాచి టైటిల్ సాంగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. యువరాజ్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. రామకృష్ణ సబ్బాని, మోనికా సబ్బాని ప్రొడక్షన్ డిజైనింగ్ సినిమాకు కలిసొచ్చింది. ముఖ్యంగా మాధవన్ మెజిస్టిక్ హౌజ్ సెట్, అప్పటి వస్తువులను గుర్తుచేస్తూ వచ్చే సాంగ్‌లో ఆర్ట్ వర్క్ బాగా ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ పరవాలేదు. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫైట్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. చందూ మొండేటి కథ బాగున్నప్పటికీ కథనం కుదరలేదు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

కాస్త కొత్తగా, విచిత్రంగా అనిపించే కాన్సెప్టులు తీసుకొని కథలు రాసుకోవడం చందు మొండేటి స్టయిల్. కార్తికేయ సినిమాలో అదే చూపించాడు. సవ్యసాచికి కూడా అదే పద్ధతి ఫాలో అయ్యాడు. కానీ ఈ సినిమాకు వచ్చేసరికి కథను విడిచి కమర్షియల్ ఎలిమెంట్స్‌పై ఫోకస్ పెట్టాడు. అక్కడే ‘సవ్యసాచి’ రిజల్ట్ మారిపోయింది.

కథను నమ్ముకొని, స్క్రీన్ ప్లేకు కట్టుబడి, ఉన్నది ఉన్నట్టు తీస్తే ఇది మరో ‘కార్తికేయ’ అయ్యేది. చైతూ కెరీర్‌లో  హిట్ మూవీగా నిలిచేది. కానీ ఈసారి కథతో పాటు అక్కినేని అభిమానులపై కూడా ఫోకస్ పెట్టాడు దర్శకుడు. చిక్కంతా అక్కడే వచ్చింది. లగ్గాయితు పాట పెట్టాల్సిన అవసరం ఏముంది ? సుభద్ర ఎపిసోడ్ ఎందుకు ? ఈ కథకు నాగార్జున, ఏఎన్నార్ రిఫరెన్సులు అవసరమా? అసలు సవ్యసాచికి, అమెరికా ఎపిసోడ్‌కు ఏమైనా సంబంధం ఉందా ?

fallbacks

ఇలా చెప్పుకుంటూ పోతే ‘సవ్యసాచి’కి సంబంధం లేని ఎపిసోడ్లు చాలానే ఉన్నాయి. అవన్నీ పక్కనపెట్టి, మైండ్‌లో అనుకున్న కథకు, ప్రేమమ్ టైమ్‌లోనే చందు మొండేటి అనుకున్న స్క్రీన్ ప్లే జోడించి ఉంటే సినిమా కచ్చితంగా హిట్ అయ్యేది.  అనవసర విషయాల జోలికి వెళ్లడంతో ఈ సినిమా యావరేజ్ మూవీగా మాత్రమే నిలిచిపోతుంది. కార్తికేయ సినిమాలో స్క్రీన్ ప్లే చందు మొండేటిని స్పెషల్‌గా నిలిపింది. ఆ మేజిక్ సవ్యసాచి సినిమాలో మిస్ అయింది.

సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాకి వానిష్‌ ట్విన్‌ సిండ్రమ్‌ అనే ఎలిమెంట్‌ని యాడ్ చేసిన చందూ, మిగతా కథను ఆసక్తికరంగా చెప్పలేకపోయాడు. తొలి 10 నిమిషాలు కాస్త ఆసక్తిగా అనిపించినా ఆ తర్వాత లవ్ ట్రాక్, కొన్ని సీన్స్‌తో బోర్ కొట్టించాడు. అన్ని సందర్భాల్లో అలర్ట్‌గా ఉండే ఎడమ చేయి ఎలిమెంట్‌ని కేవలం కొన్ని సీన్స్‌కే వాడుకోవడం సినిమాకు పెద్ద మైనస్.. ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా అంత కన్విన్సింగ్‌గా లేదు. ముఖ్యంగా మాధవన్ క్యారెక్టర్ గతంలో చూసిన కొన్ని విలన్ క్యారెక్టర్స్‌ను గుర్తుకు తెచ్చింది తప్ప, ప్రత్యేకం అనిపించలేదు.

మైనస్సులు పక్కనపెడితే, అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకునే సినిమా ఇది. నాగచైతన్యను క్లాస్, మాస్ యాంగిల్స్‌లో ఒకేసారి చూపించిన మూవీ ఇది. మధ్యమధ్యలో ఏఎన్నార్, నాగ్ రిఫరెన్సులు అభిమానుల్ని ఎంటర్‌టైన్ చేశాయి. దీనికి తోడు రీమిక్స్ ఉండనే ఉంది. హీరోయిన్ చూడ్డానికి చాలా బాగుంది. తనకున్న అనుభవంతో నాగచైతన్య మాస్ యాక్షన్ బాగానే చేశాడు. సో.. అభిమానుల్ని పక్కనపెడితే, ప్రేక్షకులను ఓ మోస్తరుగా మాత్రమే ఎట్రాక్ట్ చేస్తుంది సవ్యసాచి.

బాటమ్ లైన్ – అభిమానుల ‘సవ్యసాచి’

రేటింగ్ – 2.5/5

జీ సినిమాలు సౌజన్యంతో...

Read More