Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

Adipurush: ఆదిపురుష్‌లో విలన్ పాత్రకు స్టార్ హీరో

ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో రూపొందనున్న ఆదిపురుష్ సినిమాలో ( Prabhas in Adipurush ) విలన్ పాత్రలో ఓ స్టార్ హీరో కనిపించనున్నట్టు తెలుస్తోంది.

Adipurush: ఆదిపురుష్‌లో విలన్ పాత్రకు స్టార్ హీరో

ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో రూపొందనున్న ఆదిపురుష్ సినిమాలో ( Prabhas role in Adipurush ) విలన్ పాత్రలో ఓ స్టార్ హీరో కనిపించనున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ వర్గాల అప్‌డేట్స్ ప్రకారం తన్హాజీ మూవీ డైరెక్టర్ ఓం రావుత్ ( Om Raut ) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తన్జాహీ సినిమాలో విలన్ పాత్ర పోషించిన సైఫ్ అలీ ఖాన్‌నే ( Saif Ali Khan ) ఈ సినిమాలో విలన్ పాత్రకు తీసుకుంటున్నట్టు ఓ టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ పోషించేది రాముడి పాత్ర కావడంతో రామాయణంలో విలన్ రావణసూరుడు కనుక ఒకవేళ ఈ సినిమాలో విలన్ పాత్రకు సైఫ్ అలీ ఖాన్ సైన్ చేసినట్టయితే.. ఆదిపురుష్ మూవీలో అతడిని రావణుడి పాత్రలో చూడొచ్చు ( Saif Ali khan as Raavan ) అని ఓ ప్రచారం తెరపైకొచ్చింది. Also read : Kormo jobs app: ఉద్యోగం కావాలా ? ఈ మొబైల్ యాప్ ట్రై చేయండి అంటున్న గూగుల్

ఆదిపురుష్ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ పాత్రపై అసలు ఆ చిత్ర దర్శకుడు ఓం రావుత్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు కనుక ఇదే నిజం అని అనుకునే పరిస్థితి కూడా లేదు. ఆదిపురుష్ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర అనే ప్రచారంలో ఎంత నిజం ఉందో లేదో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త మాత్రం బాగా వైరల్ అవుతోంది. Also read : Surekha Vani: కనిపించిన ప్రతీ మగాడితో అఫైర్స్ అంటగడుతున్నారని నటి ఆవేదన

Read More