Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

ఎన్టీఆర్ బయోపిక్‌లో ఆర్ ఎక్స్ 100 హీరోయిన్?

ఎన్‌బీకే ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించి ఇప్పటికే వివిధ పాత్రలకు సెలక్షన్ జరిగిపోయింది. 

ఎన్టీఆర్ బయోపిక్‌లో ఆర్ ఎక్స్ 100 హీరోయిన్?

ఎన్‌బీకే ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించి ఇప్పటికే వివిధ పాత్రలకు సెలక్షన్ జరిగిపోయింది. ఈ చిత్రంలో నందమూరి బసవతారకం పాత్రలో విద్యాబాలన్, హరిక్రిష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్, సావిత్రి పాత్రలో నిత్యా మేనన్, జయప్రద పాత్రలో తమన్నా, శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్‌తో అనేక చిత్రాలలో నటించిన కీలక జయసుధ పాత్రకు కూడా ఓ నటిని ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి.

ఆర్ ఎక్స్ 100 చిత్రంలో నటించిన పాయల్ రాజపుత్‌ను ఈ పాత్రకు ఎంపిక చేశారని సమాచారం. గతంలో జయసుధ, ఎన్టీఆర్ కాంబినేషనులో డ్రైవర్ రాముడు, గజదొంగ, మహా పురుషుడు, అడవి రాముడు లాంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. అలాంటి జయసుధ పాత్రకు పాయల్ రాజపుత్‌ను ఎంపిక చేయడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 29 మార్చి 2018 తేదిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం హైదరాబాదులోని రామక్రిష్ణ సినీ స్టూడియోస్‌లో ప్రారంభమైంది. 

తొలుత ఈ చిత్రానికి తేజను దర్శకుడిగా తీసుకున్నా.. తర్వాత ఆయన అర్థాంతరంగా ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తు్న్నారు. గతంలో క్రిష్, బాలయ్య కాంబినేషనులో  "గౌతమీ పుత్ర శాతకర్ణి" చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా.. ఆరం రామక్రిష్ణ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ అల్లుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్న సంగతి తెలిసిందే.

Read More