Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

RGV మరో సంచలనం.. నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘పవర్ స్టార్’

RGV's Power Star Movie| వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో ఆసక్తికర టైటిల్‌తో రాబోతున్నాడు. పవర్ స్టార్ అనే కొత్త సినిమాను తెరకెక్కించనున్నట్లు సోసల్ మీడియా ద్వారా ప్రకటించాడు దర్శకుడు వర్మ.

RGV మరో సంచలనం.. నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘పవర్ స్టార్’

ఓవైపు లాక్‌డౌన్‌లో తమ సినిమా షూటింగ్‌లకు పర్మిషన్లు కావాలంటూ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు తెలుగు రాష్ట్రాల సీఎంలను కలవడం తెలిసిందే. కరోనా దెబ్బకు కొన్ని షూటింగ్స్ వాయిదా కూడా పడ్డాయి. అయితే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఏ మాత్రం తగ్గడం లేదు. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో మరో బ్రేకింగ్ న్యూస్ అంటూ మళ్లీ ట్వీట్ చేశాడు వర్మ.

ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో తన తర్వాత సినిమా ‘పవర్ స్టార్’ (Power Star Movie) అని ప్రకటించాడు. నిన్న నగ్నం (Naked Movie) విడుదల చేసిన వర్మ ఇప్పటికే మిర్యాలగూడలో సంచలనం రేపిన ప్రణయ్ హత్య, అనంతరం పరిణామాలను ఆధారంగా చేసుకుని Murder Movieని తెరకెక్కిస్తున్నారు. అంతలోనే మరో కొత్త సినిమా ‘పవర్ స్టార్’ తెరకెక్కించనున్నట్లు తెలిపాడు. 

 జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ
 

 

Read More