Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

PUBG Mobile India: పబ్ జీ ఇక ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమేనా ? పూర్తి వివరాలు చదవండి

PUBG To Launch in India |  భారత దేశంలో పబ్ జీ త్వరలో తన కార్యకలాపాలను పూర్తి స్థాయిలో ప్రారంభించనుంది. ఈ విషయం తెలియగానే గేమ్ లవర్స్ సంతోషం తారాస్థాయికి చేరుకుంది. 

PUBG Mobile India: పబ్ జీ ఇక ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమేనా ? పూర్తి వివరాలు చదవండి

PUBG Mobile India | భారత దేశంలో పబ్ జీ త్వరలో తన కార్యకలాపాలను పూర్తి స్థాయిలో ప్రారంభించనుంది. ఈ విషయం తెలియగానే గేమ్ లవర్స్ సంతోషం తారాస్థాయికి చేరుకుంది. పబ్ జీ నిర్వహించే పబ్ జీ కార్పోరేషన్ భారత దేశంలో పబ్ జీ మొబైల్ ఇండియాను సంస్థను ప్రారంభించింది. పబ్ జీ మొబైల్ లైట్ టైటిల్ ( PUBG Moblie Lite Little ) తో లాంచ్ చేసింది. పెయిడ్ అప్ ఇన్వెస్ట్మెంట్ గా రూ.5 లక్షలను సమర్పించి భారత కార్పోరేట్ ఎఫైర్స్ వద్ద నమోదు చేయించుకుంది. 

Also Read WhatsApp Mute: ఇక వాట్సాప్ లో వీడియో పంపించే ముందు మ్యూట్ చేయవచ్చు 

దీన్ని బట్టి పబ్ జీ ( PUBG ) భారత దేశంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇండియాలో అందుబాటులో రానున్న వార్త నిజమే కానీ.. అయితే ఇది ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో రెండింటిలో అందుబాటులోకి రానుందా అనే సందేహం చాలా మందిలో కలుగుతోంది. 

పబ్ జీ మొబైల్ ఇండియా ముందుగా ఆండ్రాయిడ్ ( Android ) ప్లాట్ఫామ్ లో మాత్రమే అందుబాటులోకి రానుంది అని సమాచారం. అయితే కొన్ని రోజుల తరువాతే ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ లో అందుబాటులోకి రానుంది. 

Also Read | Free BSNL Sim: సిమ్ కార్డును ఉచితంగా ఇవ్వనున్న బిఎస్ఎన్ఎల్

భారత ప్రభుత్వం కొంత కాలం క్రితం పబ్ జీతో సహా కొన్ని చైనా యాప్స్ ( China Apps ) ను బ్యాన్ చేసింది. అయితే పబ్ జీ మాత్రం సౌత్ కోరియాకు చెందిన సంస్థ కాగా.. దాని కార్యకలాపాలు మాత్రం చైనాలోని టాంసెంట్ అనే సంస్థ నిర్వహిస్తుంది. దీంతో భారత ప్రజల సైబర్ సెక్యూరిటీ, ప్రైవసీని కాపాడటానికి భారత ప్రభుత్వం దీన్ని కూడా బ్యాన్ చేసింది. కాగా ఇండియాలోని గేమర్స్ కోసం ప్రత్యేక వర్షన్ తో ముందుకు వస్తోంది పబ్ జీ.

Also Read | WhatsApp Pay : వాట్సాప్ పే చేసే సమయంలో గుర్తుంచుకోవాల్సిన 6 విషయాలు

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Read More