Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

Game On Movie: 'గేమ్ ఆన్'పై గట్టి నమ్మకంతో ఉన్నాం.. మధుబాలకు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్: నిర్మాత రవి కస్తూరి

Game On Movie Release Date: గేమ్ ఆన్ మూవీ ఫిబ్రవరి 2న ఆడియన్స్ ముందుకు రానుంది. నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ.. ఈ సినిమా కంటెంట్‌పై గట్టి నమ్మకంతో ఉన్నామన్నారు. మధుబాలకు ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌ స్టార్ట్ అవుతుందనిపిస్తోందన్నారు. 
 

Game On Movie: 'గేమ్ ఆన్'పై గట్టి నమ్మకంతో ఉన్నాం.. మధుబాలకు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్: నిర్మాత రవి కస్తూరి

Game On Movie Release Date: గీతానంద్, నేహా సోలంకి జంట‌గా దయానంద్ డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ 'గేమ్ ఆన్'. క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్  గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ర‌వి క‌స్తూరి నిర్మిస్తున్నారు. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫిబ్ర‌వ‌రి 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కానుండగా.. ప్రొడ్యూసర్ ర‌వి క‌స్తూరి మీడియాతో మాట్లాడారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచే తనకు సినిమాలపై ఆసక్తి ఉండేదన్నారు. గీతానంద్ హీరోగా, తాను ప్రొడ్యూసర్‌గా సినిమా చేయాలని అనుకున్నామని.. మంచి స్టోరీ సెట్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టామన్నారు. ప్రీ ప్రొడక్షన్‌కు ఎక్కువ సమయం కేటాయించి.. అంతా పర్ఫెక్ట్‌గా ఉండేలా ప్లాన్ చేసుకున్నామన్నారు.

ఈ ప్రయాణంలో చాలా మంచి అనుభవం వచ్చిందని చెప్పారు. ఈ మూవీ సైకలాజికల్ థ్రిల్లర్ అని.. రియల్ టైమ్ సాగే కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించామని తెలిపారు. యాక్షన్, ఎమోషన్స్‌తో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి దాన్ని ఎలా అధిగమించాడనేది గేమ్ థీమ్‌లో చూపించామన్నారు. మూవీ ప్రారంభం నుంచి చాలా నమ్మకంతో ఉన్నామని.. ప్రొడ్యూసర్‌గా ఈ చిత్రం నుంచి సహనంగా ఉండాలని నేర్చుకున్నానని అన్నారు.

హీరో గీతానంద్ తన యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాడని రవి కస్తూరి తెలిపారు. శుభలేఖ సుధాకర్ వంటి వ్యక్తిని తాను ఇప్పటివరకు చూడలేదని.. సెట్‌లో చాలా సరదాగా ఉండేవారని చెప్పారు. ఆదిత్య మీనన్ మంచి పర్ఫార్మర్ అని.. మధుబాలకు ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందని అనిపిస్తోందన్నారు. మూవీలో ఆమె చాలా కీలక పాత్ర పోషించారని.. సంగీత దర్శకుడు అభిషేక్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అవుతుందన్నారు. 

నవాబ్ గ్యాంగ్స్ అద్భుతమైన సాంగ్స్ అందించారని.. ప్రేక్షకులను ఆకట్టుంటాయన్నారు. ఫస్ట్ కాపీ చూసినప్పుడు చాలా సంతోషంగా ఫీలయ్యానని.. ఆడియన్స్‌ కూడా థ్రిల్ అవుతారని చెప్పారు. ఆస్ట్రేలియాలో వ్యాపారాలు చేస్తూ.. సినిమా చూసుకోవడం కాస్త ఛాలెంజింగ్‌గానే అనిపించిందన్నారు. ఇక్కడ పెద్ద సినిమా.. చిన్న సినిమా అని రెండు క్యాటగిరీలు ఉన్నాయని.. తమకు మాత్రం కంటెంట్‌పై పూర్తి నమ్మకం ఉందన్నారు. ఇక ప్రొడ్యూసర్‌గానే కొనసాగాలనుకుంటున్నానని.. ఈ అనుభవం మరో పది సినిమాలకు ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే రెండు కథలు విన్నానని.. త్వరలో అనౌన్స్ చేస్తామన్నారు. 

Also Read: MP Bandi Sanjay: ఎన్నికల్లో మీ దమ్మేందో చూపించండి.. ఓటనే ఆయుధంతో ఉచకోత కోయండి: బండి సంజయ్

 Also Read: AP Survey 2024: ఉత్కంఠ రేపుతున్న తాజా సర్వే, పార్టీలకు చెమట్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More