Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

ధర్మం తెలిసిన ధర్మాత్ముడు.. చిరంజీవిపై బండ్ల గణేష్.. ప్రధాని ట్వీట్ వైరల్

Bandla Ganesh on IFFI Award బండ్ల గణేష్‌ తాజాగా చిరంజీవి మీద తన భక్తిని చాటుకున్నాడు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చినందుకు చిరంజీవిని పొగిడేశాడు.

ధర్మం తెలిసిన ధర్మాత్ముడు.. చిరంజీవిపై బండ్ల గణేష్.. ప్రధాని ట్వీట్ వైరల్

Chiranjeevi IFFI Award  : చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం అరుదైన అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివెల్ ఆఫ్ ఇండియా ఈవెంట్లో ప్రకటించే ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డును చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఈ అవార్డును అమితాబ్, రజనీకాంత్ వంటి వారికి కేంద్రం బహూకరించింది. ఇప్పుడు చిరంజీవిని సత్కరించింది. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులంతా కూడా చిరంజీవికి విషెస్ చెబుతున్నారు. ఈక్రమంలో ప్రధాని మోదీ, బండ్ల గణేష్, రామ్ చరణ్‌ వేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

 

చిరంజీవి గారు ఎంతో చెప్పుకోదగ్గవ్యక్తి. అతను చేసిన పనులు, వైవిధ్యమైన పాత్రలు, ఆయన అద్భుతమైన వ్యక్తిత్వం తరతరాలుగా సినీ ప్రేమికులకు ఆకర్షిస్తున్నాయి. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నందుకు ఆయనకు అభినందనలు అంటూ నరేంద్ర మోదీ ట్వీట్ వేశారు. ఈ ట్వీట్‌ను చిరంజీవి మురిసిపోయాడు. మీరు ఇలా ట్వీట్ వేయడం నాకు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉంది ప్రధాని గారు.. అంటూ చిరు స్పందించాడు.

 

ఇక రామ్ చరణ్‌ తన తండ్రికి దక్కిన గౌరవాన్ని చూసి మరింతగా మురిసిపోయాడు. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచినందుకు ఎంతో ఆనందంగా ఉంది అప్పా.. నిజంగా ఎంతో గర్వంగా ఉంది.. మీరు ఎప్పటికీ అందరికీ స్పూర్తిదాయకమే అంటూ రామ్ చరణ్‌ సంబరపడిపోయాడు.

 

 

ధర్మం తెలిసిన ధర్మాత్ముడు న్యాయం,   తెలిసిన న్యాయకోవిదుడు,    మంచితనానికి మారుపేరు ,  మానవత్వం ఇంటిపేరు , అందరికీ నేనున్నా అనే మా అన్న మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు , అభినందనలు అంటూ బండ్ల గణేష్ ట్వీట్ వేశాడు. తన భక్తిని మరోసారి చాటుకున్నాడు.

Also Read : Mahesh Babu : గంగానదిలో అమ్మ అస్థికలు.. కృష్ణానదిలో నాన్న అస్థికలు.. పుట్టెడు దుఃఖంలో మహేష్‌ బాబు

Also Read : Allu Arjun Allu Arha Cute Video  : కందిరీగలు కుడుతున్నాయ్ అంట.. బన్నీతో అర్హ ముద్దు ముద్దు ముచ్చట్లు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More