Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

తొమ్మిదేళ్ల బాలుడు చేసిన అరుదైన ఆవిష్కరణకు దక్కిన ప్రెసిడెన్షియల్ అవార్డు..

విపత్కర పరిస్థితుల్లో సమాజానికి దోహదపడే నూతన ఆవిష్కరణలు ఎంతగానో ఉపకరిస్తాయి. వయసుతో, ప్రాంతాలతో సంబంధం లేకుండా తమవంతు ప్రయత్నాలు ఫలించి దేశాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళుతాయి.

తొమ్మిదేళ్ల బాలుడు చేసిన అరుదైన ఆవిష్కరణకు దక్కిన ప్రెసిడెన్షియల్ అవార్డు..

న్యూఢిల్లీ: విపత్కర పరిస్థితుల్లో సమాజానికి దోహదపడే నూతన ఆవిష్కరణలు ఎంతగానో ఉపకరిస్తాయి. వయసుతో, ప్రాంతాలతో సంబంధం లేకుండా తమవంతు ప్రయత్నాలు ఫలించి దేశాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళుతాయి. అయితే ఇలాంటి ఆవిష్కరణ కెన్యాలో బయటపడింది. కెన్యాకు చెందిన ఈ తొమ్మిదేళ్ల బాలుడు శుభ్రపర్చుకోవడానికి హ్యాండ్ వాషింగ్ మిషన్ పరికరం కనుగొన్నాడు. దీనికి గాను ప్రపంచవ్యాప్తంగా ప్రశంశలందుకుంటున్నాడు.

పశ్చిమ కెన్యాలోని బుంగోమా కౌంటీకి చెందిన స్టీఫెన్ అనే బాలుడు ఈ అవార్డును అందుకున్న అతి పిన్న వయస్కుడిగా చరిత్ర పుటల్లోకెక్కాడు. ఈ యంత్రాన్ని తయారుచేసే క్రమంలో స్టీఫెన్‌కు అతని తండ్రి జేమ్స్ సహాయం అందించాడు. జేమ్స్ స్పందిస్తూ.. తనకొడుకు ఈ యంత్రాన్ని తయారుచేసే క్రమంలో కొన్ని సర్దుబాట్లు చేశానని CNN తో వెల్లడించారు. .

దీనికి గాను బాలుడిని ప్రోత్సహిస్తూ 68 మంది కెన్యన్లలో స్టీఫెన్ ప్రెసిడెన్షియల్ అవార్డు అందుకున్నారు. బుంగోమా కౌంటీ గవర్నర్ వైక్లిఫ్ వంగమాట్ ఆ బాలుడికి స్కాలర్‌షిప్ సైతం అందజేస్తామని హామీ ఇచ్చారు. కాగా బాలుడి ఆవిష్కరణలకు నెటిజన్లు 'వర్ధమాన ఇంజనీర్‌' అంటూ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Read More